ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: ఇకపై ఆ బాధ్యత సచివాలయాలదే ..

మీ ఏరియాలో రాత్రి పూట స్ట్రీట్ లైటులు వెలగడం లేదా?..పగటి పూట కూడా అవి నిరంతరరాయంగా వెలుగుతూనే ఉన్నాయా?..వాటి బాగోగులు చూసే మనిషి కరువయ్యారా?..డోంట్ వర్రీ ఇకపై ఈ సమస్యలకు ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టబోతుంది. ప్రస్తుతం ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లో ఉన్న గ్రామాల్లోని వీధి దీపాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను గ్రామ సచివాలయాలకు అప్పగిస్తూ జగన్ సర్కార్ తాజాగా సర్క్యులర్‌ జారీ చేసింది.

ఇకపై స్ట్రీట్ లైట్స్‌కు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా, ప్రజలు స్థానిక గ్రామ సచివాలయాల్లో ఫిర్యాదు చేయొచ్చు. గ్రామ లేదా వార్డు వాలంటీర్ ద్వారా కూడా కంప్లైంట్ చేయించవచ్చు. ప్రభుత్వం కొత్తగా గ్రామ సచివాలయానికి ఒకరు చొప్పున నియమించిన ఎనర్జీ అసిస్టెంట్‌ తక్షణమే ఆ సమస్యపై స్పందించాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో దాదాపు 200 కరెంటు పోల్స్‌ ఉంటాయని, వాలంటీర్ల సహాయంతో ఎనర్జీ అసిస్టెంట్‌ వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని అధికారులు చెబుతున్నారు.

Comments (0)
Add Comment