అగో ఇన్నారుళ్లా గీ ముచ్చట.. మళ్ల మన దేశంలోకి డేంజర్ కరోనా వచ్చిందట. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన బ్యాడ్ న్యూస్ ను మరువక ముందే మళ్లీ వచ్చిందట.. ఇక ముందు కూడా మునుపటిలా జెరా జాగ్రత్త ఉండుండ్రి.
ప్రమాదకర కరోనా ఓమిక్రన్ XBB.15 వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. ఈ వేరేటితో ఇప్పటికే చైనా అల్లాడుతుంది. తాజాగా ఈ వేరియంట్ తొలి కేసు గుజరాత్ లో నమోదయింది.
ఓమిక్రాన్ BQ.1 తో పోలిస్తే ఇది 120 రెట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని అమెరికన్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీన్ని సూపర్ వేరియంట్ గా పేర్కొంటున్నారు నిపుణులు.
ఇది అన్ని రకాల వేరియంట్లకన్నా వేగంగా మన వ్యాధి నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందని పేర్కొంటున్నారు. ఫార్వర్డ్ యూనివర్సిటీతో ఎన్నో సంవత్సరాల పాటు పని చేసిన ఎరిక్ ఈ హెచ్చరికలు జారీ చేయడం సంచలనం అవుతుంది.