- కేంద్రానికి రోగం వచ్చింది
- కూల్చివేతలు సులువు. దేశాన్ని నిర్మించడం కష్టం
- ఇక్కడ అల్లరి చేసే వాళ్ల ఆటలు సాగవన్న కేసీఆర్
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు విరుచుకుపడ్డారు. శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్…కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇఫ్తార్ విందులో కేసీఆర్ మాట్లాడుతూ… “కేంద్రానికి రోగం వచ్చింది. చికిత్స చేయాలి. కేంద్రం, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. కూల్చివేతలు సులువు. దేశాన్ని నిర్మించడం కష్టం. ఇక్కడ అల్లరి చేసే వాళ్ల ఆటలు సాగవు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఇక్క నీళ్లు లేవు. కరెంటు కూడా లేదు. దేశమంతా ఇప్పుడు చీకటి అలముకుంది. తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయి” అని వ్యాఖ్యానించారు.