The cemetery should also shed tears
చివరికి స్మశానం కూడా కన్నీరు పెట్టాలి
ఎక్కడ నీ బంధుగణం!?
ఎక్కడ నీరక్త సంబంధం!?
ఎక్కడ నీఆత్మీయ బృందం!?
ఎక్కడ నీ కులం!?
ఎక్కడ నీమతం
ఎక్కడ ..!?
పట్టు వస్త్రాలు పరుల పాలు
పట్టు పరుపులు చాకలి పాలు
ఆస్తి, పాస్తులు బిడ్డల పాలు
విర్రవీగిన దేహం మట్టిపాలు
మరి నీవేంటి..!?
గుక్కెడు తులసి జలం
నోట్లో గుప్పెడు బియ్యం
తలపై రూపాయి నాణెం
ఒంటిపై తెల్లని వస్త్రం
ఇవి కూడా బూడిద పాలే
వీటి కోసమా..!?
పగలు_ప్రతీకరాలు
మోసపు జీవితాలు
నాటకపు బ్రతుకులు
కుళ్ళు_కుతంత్రాలు
నయవంచనలు
నమ్మకద్రోహాలు
నీతో వచ్చేది ఎవరు వచ్చేదేంటి..!?
భార్య ఇంటి గుమ్మం వరకు
బిడ్డలు కట్టె కాలే వరకు
బంధువులు స్మశానం వరకు
కానీ నీ మంచితనం నీవు అస్తమించినా
ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది.
నీ బ్రతుకు ఎలా ఉండాలంటే
నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి..
నీ మరణం ఎలా ఉండాలంటే
దేహంకాలిబూడిదైనా
నలుగురుగొప్పగాచెప్పుకునేలా_
ఉండాలిజీవితం..
నీ చివరి మజిలీలో స్మశానం కూడా కన్నీరు పెట్టాలి..
గొనుగుంట్ల అంజన దేవి,
యోగ టీచర్