The beauties of my villages నా పల్లెల అందాలు

The beauties of my villages
నా పల్లెల అందాలు

పచ్చని పొలాలు పలకరిస్తుంటే
పిల్ల కాలువలు గలగలా నవ్వుతుంటే
మంచు దుప్పటి కప్పిన వూరు
ఎవరు లేపుదురో గాని
కోడెపుడు కూస్తుందాయని
ఎదురు చూస్తూ కూచుంటుంది

కొరుకుతున్న గజగజల చలికి
చలిమంటల వెచ్చదనంతో
చల్లబడిన ఒళ్ళంతా
సైరతో సర్రున గరమయ్యేను

అవ్వా.! జర్ర బువ్వుంటెయ్యంటూ,
ఎపుడు తెల్లారునో యని
ఎదురుచూసే బిచ్చగాళ్ల కేకలు
వూరవతలి గుడిగంటల చప్పుల్లను

గుట్టుగా కప్పేస్తాయి

ఇంటి పెరట్లోని బర్లు
ఇంతేసి పేడేస్తె ముద్దగా అవి మారి
పిడకలై గోడకు మురిసిపోతుంటాయి
అయ్య ఆదాయానికింత ఆసరవుతూ.

సందడిచేస్తూ సద్దన్నం మూటగట్టుకుని
బర్లు, గొర్లను బయటికి మేతకై తీసుకెలుతుంటే
మందంగా పూచిన మంచుపూల చాటునుంచి
ఉదయారుణ కిరణాలు
ఉరికురికి వస్తున్నాయి, ఎంత పొద్దాయెనోయని

కిలకిలరాగాల పక్షులెగురు వేళ
పసిడి నవ్వుల పూలు పరిమళించువేళ
పడకమీదనుండి అతివ పైట సర్దువేళ
పరుచుకున్న నా పల్లె అందాలు
అక్షరాలకందని ఆత్మీయ స్పర్శలు

చ్చరాజమౌళి
దుబ్బాక, 9059637442

The beauties of my villages / zindhagi.com / yatakarla mallesh
Comments (0)
Add Comment