That mother fight that shook the Naxalites
నక్సలైట్లను కదిలించిన ఆ తల్లి పోరాటం
అగో గీ ఫోటోను చూస్టే మీకేమనిపిత్తుంది. లైఫ్ మీద విరక్తి పెరిగి చంటి బిడ్డతో అడవుల పొంట పోతుందానిపిత్తుందా..? అడవిలోకి చంటి బిడ్డతో ఆ తల్లి పోయేది నిజమే. అగో.. అడవిలోకి పోవుడు ఎందుకనుకుంటుండ్రా.. గప్పుడెప్పుడో యమ ధర్మరాజుతో కొట్లాడి మొగాడి ప్రాణాలు తెచ్చుకున్న సతీ సావిత్రి ఎరుకే గదా.. ఇగో గట్లనే మొగుడి పాణాలను కాపాడుకోవడానికి గిట్ల అడవిలోకి పోయింది గా తల్లి. అసలు ముచ్చటకు వద్దాం..
నక్సలైట్లను కలువడానికి చంటి బిడ్డతో
యముడితో కొట్లాడి తన భర్త ప్రాణాలు కాపాడుకున్నసతీసావిత్రి లాగానే ఇగో ఇంజనీర్ భార్య అర్పిత చంటి బిడ్డతో అడవిలోకి పోయింది. మావోయిస్టు నక్సల్స్ చెరలో నుంచి తాళి కట్టిన భర్తను కాపాడుకుంది ఇంజనీర్ భార్య అర్పిత. ప్రేమగా చూసుకునే నా భర్త లేకుండా నేను బతుకలేనని మొండిగా నక్సలైట్లను కలుద్దాం అని అడవిలో నడిచింది. గీ విషయం సోషల్ మీడియాలో మత్తు వైరల్ అయ్యిందట. చస్తే చస్తా అని అడవిలోకి పోయిన అర్పిత కన్నీళ్లకు కరిగి పోయిండ్రట నక్సలైట్లు.
ప్రజాకోర్టులో రిలీజ్
చత్తీస్ ఘడ్ లో మావోయిస్టు నక్సల్స్ పిఎంజిఎస్ వై సబ్ ఇంజనీర్ అజయ్ రోషన్ లక్రాను బీజాపూర్ లో ప్రజాకోర్టు పెట్టి ఇంజనీర్ అజయ్ రోషన్ లక్రాన్ రిలీజ్ చేసిండ్రి నక్సలైట్లు. వారం రోజుల తిండి లేకుండా చంటి బిడ్డతో అడవుల వెంట తిరిగిన భార్య అర్పిత కన్నీళ్లకు కరిగి పోయి నక్సలైట్లు భర్తను రిలీజ్ చేసిండ్రని అనుకుంటుండ్రు. గిప్పుడు రిలీజైన భర్త అజయ్ రోషన్ లక్రాన్ తో భర్త అర్పిత చంటి బిడ్డతో హెప్పిగా ఉంది.
అయినా.. విప్లవం కోసం నక్సలైట్లు-పోలీసులు కొట్లాట ఇంకెన్ని రోజులో…?