థాంక్స్ గోవన్న.. నిజంగా మీరు మాస్ లీడరే..

థాంక్స్ గోవన్న..

నిజంగా మీరు మాస్ లీడరే..

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..

ఆపదలో ఉండి ఎవరు వెళ్లినా అప్పటికప్పుడు సహాయం చేయడం అతని నైజం. 

అందుకే అతనిని ‘మాస్ లీడర్’ అంటారు.  ‘‘గోవన్నా..’’ అని ప్రేమతో కూడా పిలుస్తారు.

అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్నా.. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తనదైన ముద్ర వేసుకున్నారు బాజిరెడ్డి గోవర్ధన్. ఆర్టీసీ చైర్మన్ గా కార్మికుల పక్షాన నిలుస్తున్నారు.

ఇంతకు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే..???

నేను పుట్టిన ఊరు నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం కేశపల్లి.

మా ముదిరాజ్ కులస్థులు ఆరాధ్యదైవంగా భావించే పెద్దమ్మ దేవతను పూజిస్తారు.

ఆతల్లిని ఇంటి దేవతగా కొలుస్తారు.

కానీ.. ఆ పెద్దమ్మ గుడి ఎప్పుడో నిర్మాణం చేసినందున శిథిలావస్థకు చేరింది.

కూలడానికి సిద్దమైంది. ఆ విషయాన్ని గుర్తించిన ముదిరాజ్ కులస్థులు ఎండోమెంట్ కు రెండు లక్షల యాభై వేలు కడితే వారు పది లక్షలు మంజూరు చేశారు.

 

ఆ నిధులు ఎటు సరి పోవు.. ఏమి చేయాలో అర్థం కాలేదు. పెద్దమ్మ టెంపుల్ కు అయ్యే ఖర్చు అక్షరాల ముప్పయి లక్షలు. మరో ఇరువై లక్షలు ఎలా..?? ముదిరాజ్ కులస్థులు తలా కొంత డబ్బులు జమ చేసుకున్నారు.

అయినా.. సరిపోవడం లేదు.

పెద్దమ్మ టెంపుల్ నిర్మాణం కోసం విరాళాలు సేకరించాలని నిజామాబాద్ జిల్లాలోని కొందరి దాతలను కలిశారు. ఐదు లక్షల పైనానె విరాళాలు సేకరించారు.

మరో పదిహేను లక్షల వరకు కావాలి.. ఎలా..???

కట్ చేస్తే..

మార్చి 26న రాత్రికి పుట్టిన ఊరుకు నేను వెళ్లాను. రాత్రి అక్కడే ఉండి పొద్దున్నే వాకింగ్ చేస్తూ వెళుతుంటే నిర్మాణంలో ఉన్న పెద్దమ్మ టెంపుల్ కనిపించింది.

రెండేళ్ల క్రితం మా తమ్ముడు దేవేశ్ పెద్దమ్మ టెంపుల్ కు డబ్బులు ఇప్పియ్యుమన్న విషయం గుర్తుకు వచ్చింది.

 ఆ సమయంలో నాకు రాజ్యసభ సభ్యులు కె.ఆర్. సురేష్ రెడ్డి గారు గుర్తుకు వచ్చారు.

అతని వద్దకు వెళ్లి ‘‘పెద్దమ్మ టెంపుల్ కోసం నిధులు’’ అడిగితే తప్పకుండా ఇస్తాడనుకున్నా..

పెద్దమ్మ దేవాలయం అభివృద్ది కమిటీ పేరుతో ఉన్న లెటర్ ప్యాడ్ పై నిధులు మంజూరు చేయాలని రాసి కె.ఆర్. సురేష్ రెడ్డి గారికి అంద చేశాను.

ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా ‘‘మల్లేష్ భాయ్.. పిఏ లేడు.. నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ తయారు చేపిస్తాను. ’’ అని అన్నారు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి.

జర్నలిస్ట్ గా ఏది ఆశించకుండా అతనికి చాలా సహాయం చేశాను. వ్యక్తిగతంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాకు శతృవు కాదు.. కానీ.. 2014లో జరిగిన ఎన్నికలలో సురేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలువాలని కరపత్రం తయారు చేసి స్వంత డబ్బులతో 20 వేల కలర్ కరపత్రాలు ముద్రించి ఇచ్చాను. ఆ ఎన్నికలలో కరపత్రం డబ్బులు ఇస్తానంటే కూడా నేను తీసుకోలేదు. అందుకే పెద్దమ్మ టెంపుల్ కు డబ్బులు తప్పకుండా ఇస్తాడనే నమ్మకం..

కానీ.. ఒక నెల.. రెండు నెలలు.. మూడు నెలలు గడిసాయి. కె.ఆర్. సురేష్ రెడ్డి మరిచి పోయాడేమో అనుకున్నా. మరోసారి లేఖను అతని వాట్సాప్ కు పోస్ట్ చేసి గుర్తు చేశాను.

అతను వెంటనే స్పందించి ‘‘నాకు గుర్తుంది మల్లేష్ భాయ్..’’ అన్నారు సురేష్ రెడ్డి.

ఇప్పుడు రెండేళ్లు గడిసాయి.

ఆ సురేష్ రెడ్డి నుంచి పెద్దమ్మ దేవాలయం నిర్మాణం కోసం నయా పైసా నిధులు మంజూరు చేస్తూ ఇప్పటికీ ప్రొసిడింగ్ రాలేదు.

ఔను.. అతను పొలిటికల్ లీడర్ గదా.. తియ్యని మాటలతో హామీలు ఇవ్వడం వారి నైజం అనుకున్నాను. మరోసారి కె.ఆర్.సురేష్ రెడ్డిని పెద్దమ్మ టెంపుల్ కోసం నిధులు అడుగవద్దు అనుకున్నాను.

కట్ చేస్తే..

మార్చి 27న వాకింగ్ చేస్తూ వెళుతుంటే పెద్దమ్మ టెంపుల్ కనిపిస్తే అక్కడికి వెళ్లాను.

తూర్పున ఉదయిస్తున్న సూరీడు ఆ టెంపుల్ పక్క నుంచి ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ఆ ఫోటోలను సెల్ ఫోన్ లో బంధించాను.

నేను నాస్తికుడిని.. టెంపుల్ నిర్మాణంకు నిధులు అడుగాలంటే ఏదో ఫీలింగ్.. అయినా.. జర్నలిస్ట్ మితృడు దండుగుల శ్రీనివాస్ కు పెద్దమ్మ గుడి ఫోటోలు పంపాను. ఎమ్మెల్యే గోవన్నతో మాట్లాడి ఐదు లక్షల రూపాయలు పెద్దమ్మ టెంపుల్ ప్రహారి గోడకు ఇప్పించాలని కోరాను.

అంతే.. ఈరోజు (28న) ఉదయం ముదిరాజ్ కుల పెద్దలు దండుగుల శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను కలిశారు.

ఆ వెంటనే ఐదు లక్షల రూపాయలు సిడిపి నిధులు మంజూరు చేస్తూ ప్రొసిడింగ్ ఇవ్వాలని తన పీఎకు అప్పటికప్పుడు ఆదేశించారు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.

కె.ఆర్.సురేష్ రెడ్డికి బాజిరెడ్డి గోవర్దన్ కు ఎంత తేడా..?

అందుకే బాజిరెడ్డి గోవర్ధన్ మాస్ లీడర్ అయ్యారు.

రాజ్యసభ సభ్యుడుగా సురేష్ రెడ్డి ఢిల్లీకి పరిమితమై నిజామాబాద్ జిల్లాలో కనిపించకుండా పోయారు.

‘‘అన్నా గోవన్నా.. థాంక్స్ అన్నా..

మీకు కేశపల్లి ముదిరాజ్ కులస్థులు రుణ పడి ఉంటారన్నా…’’

యాటకర్ల మల్లేష్, సీనియర్ జర్నలిస్ట్

 

Bajireddy Govardhan MLAPeddamma temple keshapallyThanks Govanna.. You are really a mass leader..Yatakalra mallesh jouralist
Comments (0)
Add Comment