ఉద్యమకారుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కన్నుమూత

ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి (79) అనారోగ్యంతో కన్నుమూత.

బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో భౌతికకాయం ఉంచారు.

1969 ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన శ్రీధర్ రెడ్డి.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివిన శ్రీధర్ రెడ్డి

*ఓయూ తొలిదశ 1969 ఉద్యమకారులు డాక్టర్ ఎం శ్రీధర్ రెడ్డి మృతి*

*సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి(STPS) నాయకులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి కన్నా ముందే తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని తట్టి లేపిన 1969 తొలి దశ ఉద్యమ వ్యవస్థాపకులు,ఓయూ అలుమిని సభ్యులు, ఓయూ Aహాస్టల్ నుండే తెలంగాణ ఉద్యమ జ్వాలలు దేశవ్యాప్తంగా ఎగ జిమ్మిన ఉద్యమనేత డాక్టర్ ఎం శ్రీధర్ రెడ్డి సోమవారం మద్యాహ్నం కేర్ బంజారా ఆసుపత్రిలో కన్నుమూశారు.రేపు మద్యాహ్నం12గంటలకి జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.ఈ సందర్భంగా ఆయన సమకాలికులు టిపిసిసి ఉపాధ్యక్షులు కుమార్ రావు మరియు మలిదశ తెలంగాణ ఉద్యమనేత తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ టిపిసిసి రాష్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ సోమవారం శ్రీధర్ రెడ్డి గారి మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోట‌ని నిఖార్సైన తెలంగాణ పోరాట యోధుడు ని తెలంగాణ కోల్పోవడం బాదకరమని మానవతారాయ్ కొనియాడారు*


 

 

telangana-activist-dr-sridhar-reddy-passes-away
Comments (0)
Add Comment