నమ్మకం vs నిజ జీవితం (రియాలిటీ)
ప్రాణ భయం వెంటాడుతుంటే అన్ని మార్గాలను అన్వేషిస్తారు. ఎలాగైనా తనను బతికించాలని నమ్మకం లేక పోయినా పెద్దలు చెప్పే మాటలు వింటుంటారు. ఇగో.. సినీ హీరో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కూడా రకరకాల పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తారకరత్న ఆరోగ్యం బాగుండాలంటే మృత్యుంజయ మంత్రం అతని చెవిలో చెప్పాలని ఓ పండితుడు చెప్పాడట.. సో.. హీరో బాలక్రిష్ణ స్వయంగా ఆ మంత్రంను తారక రత్న చెవిలో బాలక్రిష్ణ స్వయంగా వినిపించాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మృత్యుంజయ మంత్రం..
మృత్యుంజయ మంత్రం గురించి చెప్పినవాళ్ళు ఆ మంత్రం మీద నమ్మకం ఉంటే ఇంకా ఆ తారక్ ను హాస్పిటల్ లో ఉంచడం ఎందుకు అంటూ జన విజ్ఞాన వేదిక వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.
మంత్రం మీద నమ్మకం లేకనేనా.. ? మృత్యుంజయ హోమం కూడా జరుపుతున్నారట అనంతపురంలో..మరి తారక్ ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఆ హోమం దగ్గర కూర్చోపెట్టచ్చుగా..
మంత్రాల మీద, హోమాల మీద అంత గట్టి నమ్మకం ఉంటే హాస్పిటల్ కి ఎందుకు పరుగులు.. నమ్మకాలు నిజాలైతే ఈ అంబులెన్స్ లు పేషంట్లను హాస్పిటల్ కు కాకుండా ఆలయాలకు, హోమగుండాలకు తీసుకెళ్ళాలి కదా… అంటూ జన విజ్ఞాన వేదిక వారు పెట్టిన పోస్ట్ లపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తారకరత్నకు చికిత్స..
సినీహీరో తారకరత్న ఆరోగ్యం ఇంకా సీరియస్ గానే ఉంది. బెంగుళూర్ లో ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నప్పటికీ సాధారణ పరిస్థితికి రాలేదని వైద్యులు చెబుతున్నారు.