Sunkara satya narayana
సుంకర సత్యనారాయణ
కలలు కన్నాడు నిజం చేశాడు..
‘‘ఓరేయ్ నేనెప్పుడన్న పోలీసు నౌకరే చేస్తారా..’’
సర్కార్ స్కూళ్లో పదవతరగతి చదివేటప్పుడు అతను తోటి విద్యార్థులకు చెప్పిండు. డిగ్రీ తరువాత రెండు గవర్నమెంట్ జాబ్ లు వచ్చినయి. ఇష్టం లేని పని కష్టంతో చేయద్దానుకున్నాడు. ఇంకేముంది. ఆ సర్కార్ కొలువులకు గుడ్ బై చెప్పిండు. సబ్ ఇన్ స్పెక్టర్ గా ప్రభుత్వం నోటిఫికేషన్ రాగానే ఇంట్లో చెప్పకుండానే ఎగ్జామ్ రాసిండు. కోరుకున్న జాబ్ అప్పాయ్ మెంట్ ఆర్డర్ తో అతను ఇంటికెళ్లితే.. నిజమా..? అని ఊరోళ్లే ముక్కు మీద వేలేసుకున్నారు. ఖాకీ డ్రెస్ వేసుకని ముప్పయి మూడేళ్లు పని చేసిన సుంకర సత్యనారాయణను ‘జిందగీ’ పలుకరించింది.
పోలీసు పటెల్ కుటుంబం నుంచి..
సూర్యపేట్ జిల్లా కేంద్రకు చెందిన సుంకర సత్యనారాయణ తన తండ్రి గురువయ్య పోలీసు పటెల్ నుంచి పవార్ ను స్పూర్తిగా తీసుకున్నాడు. హైస్కూల్ లో చదివే టప్పుడు నెక్కర్ వేసుకుని వచ్చే కానిస్టేబుల్ పవార్ ను చూసి తానెప్పుడైన ఖాకీ డ్రెస్ వేసుకుని ప్రజలకు సేవాలందిస్తానని తరచు తన ఫ్రెండ్స్ కు చెప్పేవారు. వ్యవసాయ శాఖలో, వైద్య శాఖలో వచ్చిన సర్కార్ కొలువులకు స్వస్తీ పలికాడు. డిగ్రీతో పాటు బిఇడి, ఎల్ ఎల్ బి చదివారు. 1985లో సబ్ ఇన్ స్పెక్టర్ గా ప్రారంభించిన ఉద్యోగ ప్రస్థానం డిప్యూట్ కమీషనర్ ఆఫ్ పోలీసుగా పదవీవిరమణ పొందారు. 33 ఏళ్ల పోలీసు సర్వీసులో మరిచి పోలేని అనుభవాలు ఎన్నో. పోలీసు జాబ్ అంటే ఎప్పుడు సమస్యల సవాళ్లే. ఆ సవాళ్లతోనే జర్నీ చేసిన సుంకర సత్య నారాయణ వివాదాలకు అతీతంగా విధులు నిర్వహించినట్లు చెబుతాడు. స్మార్ట్ గా కనిపించే Sunkara satya narayana సుంకర సత్యనారాయణను సినీ హీరో సుమన్ గా ప్రేమతో పిలిసే వారు.
ప్రజల హృదయాలలో నిలిసిన సుంకర..
సుంకర సత్యనారాయణ చేసిన ఏరియాలో అతని పేరు స్థిర స్థాయిగా నిలిసి పోవడానికి రాజకీయాలకు అతీతంగా పేదలకు న్యాయం చేయడమే. సీట్ లో కూర్చుంటే బ్యాక్ సైడ్ గోడపై సింహం బొమ్మ తప్పని సరి ఉండేది. సబ్ ఇన్ స్పెక్టర్ గా బుల్లెట్ పై వస్తుంటే పొకీరిలు పారి పోవాల్సిందే. ప్రజలలో హీరోగా ఉండాలని తహతహాలాడే సుంకరి సత్యనారాయణ పని చేసిన ఏరియాలో ఇప్పటికీ అతని పేరు గుర్తు చేస్తుంటారు. తప్పు చేసింది ఎవరైనా కారణాలు తెలుసుకుని నవ్వుతూ సమస్యను పరిష్కరించేవారు Sunkara satya narayana సుంకర సత్యనారాయణ. పోలీసు ఉన్నతాధికారులు దినేష్ రెడ్డి, అనుభవం సుంకర స్వంతం.
ఉద్యోగ ప్రస్థానం..
1985లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పోలీస్ ఆఫీసర్ గా జర్నీ స్టార్ట్ చేసిన సుంకర సత్యనారాయణ ఆర్మూర్ లో మట్కా కింగ్ లను, గల్ఫ్ ఎజెంట్ల భరతం పట్టాడు. 1995లో సి.ఐగా ప్రమోషన్ పొందారు. వికారాబాద్ లో విధులు నిర్వహిస్తే వివాదాలతో సస్పెండ్ కావడం అనావాయితీ. అక్కడ సీఐగా ప్రజల సహాకారంతో మూడేళ్లు పని చేసిన రికార్డ్ అతనిదే. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో పని చేసిన Sunkara satya narayana సుంకర సత్యనారాయణ తన అనుభవాలను ‘జిందగీ’తో షేర్ చేసుకున్నారు.
జిందగీ : మీ కుటుంబ నేపధ్యం..?
సుంకర : వ్యవసాయ కుటుంబం. తండ్రి ఊరువయ్య పోలీసు పటేల్, తల్లి రంగమ్మ. భార్య పాప లక్ష్మీ, ఇద్దరు కూతుర్లు సరిత- అతని ఇద్దరూ డార్టరులే. అల్లుళ్లు రమేష్- రఘుకాంత్ కూడా డాక్టర్ లు. కుమారుడు జయప్రకాష్ హైకోర్టు న్యాయవాది.
జిందగీ : పోలీసు ఆపీసర్ గా ప్రస్థానం..?
సుంకర : 1985లో ఎస్సైగా జాబ్ అప్పాయ్ మెంట్ ఆర్డర్ చేతికి రాగానే ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. నాకు ఎస్సై గా జాబ్ వచ్చిందంటే మా ఇంటోళ్లెవరు నమ్మలేరు. విధుల నిర్వహణలో ఎప్పుడు సస్పెండ్ కాలేదు. నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తే ఉన్నతాధికారులు అభినందిస్తారనేది నిజం. నేను పదవీ విరమణ పొందేనాటికి సౌత్ జోన్ ట్రాఫిక్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసుగా విధులు నిర్వహించడం తృప్తినిచ్చింది. ఈ జాబ్ జర్నీలో ఎన్నో మంచి-చెడు అనుభవాలున్నాయి.
జిందగీ : పోలీసు ఆఫీసర్ గా ఎందుకు కావాలనుకున్నారు..?
సుంకర : విద్యార్థి దశలో సినీమాలలో పోలీసు ఆఫీసర్ పాత్రలను ఇష్టంగా చూసేవాణ్ణి. ‘నేటి భారతం’ సినిమాలో సినీ హీరో సుమన్ పాత్ర నచ్చింది. హైస్కూల్ లో చదివేటప్పుడు కానిస్టెబుల్ పవార్ చూసినప్పుడే భవిష్యత్ లో పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక కలిగింది. జస్టీస్ చౌదరి, కొండవీటి సింహం, బొబ్బిలి పులి సినీమాలు తనపై ప్రభావం పడ్డాయి.
జిందగీ : పోలీసు ఆఫీసర్ గా మరిచి పోలేని చేదు సంఘటన ఉందా..?
సుంకర : నిజామాబాద్ రూరల్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నప్పుడు జరిగిన సంఘట జీవితాంతం నన్ను వెంటాడుతాది. నిజామాబాద్ రూరల్ మండలం భైరపూర్ అడవులలో నక్సలైట్ దళం ఉన్నట్లు ఖచ్చితమైన సమాచారంతో సాయంత్రం పదు నాలుగురు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టాం. అడవిలో దారి వెంట వెళుతుంటే మాకోసం ఏర్పాటు చేసిన మందు పాతరలు, క్లైమార్ మాన్స్ ను గుర్తించ లేక పోయాం. అప్పటి వరకు మా కోసం ఎదురు చూసిన నక్సలైట్లు వెళ్లి పోయారు. తిరిగి అదే దారిలో రాకూడదు. కానీ.. తిరిగి తెల్లారి అదే దారిలో వచ్చేటప్పుడు చెట్లకు పెట్టిన బాకిట్లు కనిపించాయి. పదునాలుగు మందు పాతరలు అక్కడ కనుక్కొవడంతో మరో జన్మలాగే అనిపించింది. నక్సలైట్లు మందు పాతర పేల్చి ఉంటే ప్రాణాలు పోయేవి.
జిందగీ : మీ జాబ్ లో తృప్తిని ఇచ్చిన సంఘటన..?
సుంకర : వికరాబాద్ లో మూడేళ్లు సీఐగా పని చేసిన సంతోషం మరిచి పోలేనిది. అక్కడ పని చేసిన పోలీసు అధికారులు సస్పెండ్ కావడమో.. వివాదాలలో ఇరుక్కోని వెళ్లి పోవడం జరిగేది. అన్యాయం జరిగిందని వచ్చిన ప్రజలకు సేవాలందించిననే సంతోషం మిగిలింది.
జిందగీ : ఒకప్పటి పోలీసింగ్.. ఇప్పటి పోలీసింగ్ ఏమైనా తేడా ఉందా..?
సుంకర : ఒకప్పుడు సీఐలకు కూడా జీపులుండేవి కావు. క్రైమ్ ఎక్కువే. మాకున్న డొక్కు జీపులుండేవి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు ప్రిపేర్ ఇచ్చారు. ఒక్కో పోలీస్ స్టేషన్ కు ఇన్నోవ వెహికిల్స్ ఇవ్వడం గ్రేట్. అంతెకాదు ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ఇప్పుడు క్రైమ్ తగ్గింది.
జిందగీ : పోలీసు అధికారిగా రిటైర్ కాగానే చాలా మంది అధికారులు పొలిటికల్ వైపు చూస్తున్నారు. మీకు ఆ ఆలోచన లేదా..?
సుంకర : పొలిటికల్ బిజినెస్ లా మారింది. ఎలక్షన్ లలో ఎంత ఖర్చు చేశాం. మళ్లీ ఎంత సంపదించాం అనే పరిస్థితులు ఉన్నాయి. అయినా.. ఓట్లను నోట్లతో కొనే ఈ పరిస్థితులలో నాలోంటోడికి సాధ్యం కాదు. ప్రజా సేవా చేయాలనే ఆలోచన ఉంటే పదవులు అవసరం లేదు.
జందగీ : రిటైర్ మెంట్ తరువాత ఇప్పుడేమి చేస్తున్నారు..?
సుంకర : సినీమాలలో నటించడం అంటే నాకు ఇష్టం. రిటైర్ మెంట్ తరువాత నాలుగు సినీమాలు, ఆరు సీరియల్స్ లలో పోలీసు అధికారిగా నటించాను. టైమ్ ఉన్నప్పుడు సోషల్ వర్క్ చేస్తున్నాను. కరోనా సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఫిట్నెస్ కోసం పొద్దున్నే యోగ, వ్యాయమం చేస్తూ కాలం వెళ్ల తీస్తున్నాను.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
949 222 5111