Students who helped teachers
కన్న బిడ్డలు వద్దానుకున్నారు..
బుద్దులు నేర్పిన టీచర్ ని చేరదీసిన విద్యార్థులు
విద్యలేని వాడు వింత పశువు.. ఈ మాట చిన్నప్పుడు జెండా వందనం రోజు ఊరేగింపులో వినేవాళ్లం. కానీ.. దాని అర్థం పెద్దాయనంక తెలుస్తోంది. కని పెంచి విద్య బుద్దులు ఇచ్చిన తల్లిని కాదనుకున్నారు కన్న బిడ్డలు. అయినా.. తమకు అక్షరాలు నేర్పి ప్రయోజకులను చేశారని భావించిన అనాధగా ఉన్న ఆ టీచర్ ను అక్కున చేర్చుకున్నారు విద్యార్థులు.
బిక్షటన చేస్తున్న మ్యాచ్ టీచర్
విద్యా ఆమె కేరళలోని మలప్పురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎంతో తెలివైన మాజీ గణిత ఉపాధ్యాయురాలు. మూడు సంవత్సరాల క్రితం, ఒక మహిళ #దివ్య ఎస్ అయ్యర్ (ఐఏఎస్) కేరళలోని ఒక రైల్వే స్టేషన్‌లో ఆమె భిక్షాటన చేయడాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఆమె జీవితం మారిపోయిందని చెప్పవచ్చు. కానీ ఆ సమయంలో ఆమె దివ్యని సరిగ్గా గుర్తించలేదు. కానీ దివ్య(విద్యార్థి) వెళ్లి చూడగా ఆమెకి అర్థమైంది ఆ భిక్షాటన చేసే మహిళా తన క్లాస్ టీచర్ విద్యా గారు అని.
నా పిల్లలు నన్ను వదిలి పెట్టారు..
🔸దివ్య ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఇలా అన్నారు👇
నీళ్ల సీసాలు, పాత బట్టల ముక్కలతో కూడిన రెండు పాలిథిన్ బ్యాగులు ఆమె వద్ద ఉన్నాయి. ఆమె తన వల్ల ఒక్క ఆకు కూడా రాలిపోకూడదన్నట్లుగా, ఆమె దగ్గర్లోని చెట్టు నుండి చిన్న చిన్న పండ్లను తెంచుకుని తినడం నేను చూశాను. విద్యా మేడమ్ ఏమిటిది అని నేను ఆడిగినదానికి ఆమె ఇలా అన్నారు. నేను పదవీ విరమణ చేసిన తర్వాత నా పిల్లలు నన్ను విడిచిపెట్టారు, వారు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో వారి జీవితం గురించి నాకు తెలియదు.
బిక్షటన చేసే టీచర్ కు చేయూత..
అందుకే నా బ్రతుకు బండిని కొనసాగించడానికి నేను ఇలా రైల్వే స్టేషన్ ముందు బిచ్చమెత్తుకోవలసిన పరిస్థితి కి మారాల్సి వచ్చింది అన్నారామె. అప్పుడు దివ్య (విద్యార్థిని) మనసు చలించిపోయింది తన ఇంటికి తీసుకువెళ్లి టీచర్ కు మంచి బట్టలు వేసి భోజనం పెట్టి తనతో కలిసి చదువుకున్న స్నేహితులందరినీ సంప్రదించి తన భవిష్యత్తు కోసం ప్లాన్ చేసింది. అంతే కాకుండా ఆమెకు నివసించడానికి మంచి ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. సొంత పిల్లలు ఆమెను విడిచిపెట్టారు కానీ ఆమె విద్య నేర్పిన పిల్లలు వదిలిపెట్టలేదు.
అదే కదా! గురు శిష్య పరంపర యొక్క గొప్పతనం.. విద్య బుద్దులు ఇచ్చిన టీచర్ ను అక్కున చేర్చుకున్న స్టూడెంట్స్ కు హ్యాట్సాఫ్.
సోషల్ మీడియా నుంచి..