మాస్కు ధరించకుండా తిరిగితే కఠిన చర్యలు

AP 39TV 20 ఏప్రిల్ 2021:

కరోనా సెకండ్ వెవ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ప్రతి ఒక్కరు.ప్రభుత్వం సూచించిన నిబంధనలు నియమాలు పాటిస్తూ మాస్కు తప్పని సరిగా ధరించాలి అని పట్టణ ప్రజల కు సీఐ శ్రీనివాసులు సూచించారు. పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలోనూ పలు వీధుల్లో సిఐ శ్రీనివాసులు పర్యటించి కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని మన రక్షణ కోసం మన కుటుంబం కోసం ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి అన్నారు. ధరించకుండా రోడ్లపైకి వచ్చినవారికి జరిమానా విధించడంతో పాటు రానున్న రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ ఆరోగ్యం కోసమే అవగాహన కల్పిస్తున్నామని పట్టణ ప్రజలు కరోనా పట్ల అవగాహన పెంచుకుని బయట తిరగకుండా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు.

 

 

Comments (0)
Add Comment