Spread the beak ఎంగిలి విస్తరాకు

Spread the beak
ఎంగిలి విస్తరాకు

“విస్తరాకును” ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని ‘భోజనానికి’ కూర్చుంటాము.
భోజనము తినేవరకు “ఆకుకు మట్టి” అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం ‘ఆకును’ (విస్తరిని) మడిచి ‘దూరంగా’ పడేస్తాం.

“మనిషి జీవితం” కూడా అంతే ఊపిరి పోగానే “ఊరి బయట” పారేసి వస్తాము.

‘విస్తరాకు’ పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే ‘పొయేముందు ఒకరి ఆకలిని’ తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న ‘తృప్తి’ ఆకుకు ఉంటుంది.

‘విస్తరాకుకు’ ఉన్న ఆలోచన భగవంతుడు “మనుషులకు” కూడా ఇవ్వాలని  ప్రార్థిస్తూ….

‘సేవ’ చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ ‘సేవ’ చేయండి.

మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని “వాయిదా” వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే ‘కుండ’ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు ‘విస్తరాకుకు’ ఉన్న ‘తృప్తి’ కూడా మనకి ఉండదు..

ఎంత ‘సంపాదించి’ ఏమి లాభం? ‘ఒక్కపైసా’ కూడా తీసుకుపోగలమా?

కనీసం ‘మన ఒంటిమీద బట్ట’ కూడా మిగలనివ్వరు..

అందుకే ‘ఊపిరి’ ఉన్నంత వరకు “నలుగురికి” ఉపయోగపడే విధంగా ‘జీవించండి’.. ఇదే జీవిత పరమార్ధం🙏

వయ్యామ్మెస్ ఉదయశ్రీ

Spread the beak /zindhagi.com / yatakarla mallesh
Comments (2)
Add Comment