Guinness World Record గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన శివలాల్

Shivlal holds Guinness World Record

సక్సెస్ స్టోరీ
గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన శివలాల్

అతను జీవితంలో ఎదురిదాడు. హేళనను పట్టించుకోలేడు. అవమానలను అధిగమించాడు. కష్టాలను చూసి కృంగి పోలేడు. అందరికీ భిన్నంగా బతుకాలని భావించాడు. సృజనాత్మకతతో ముందుకు వెళ్లితే విజయం దేహీ అంటుందని నిరూపించాడు శివలాల్. మరుగుజ్జు తన అభివృద్దికి అడ్డు రాదని ఆత్మస్థాయిర్యంతో ముందుకు వెళ్లాడు. గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఔరా..? అనిపించుకున్నాడు. నేటి యువతకు ఆధర్శంగా నిలిసిన శివలాల్ ను ‘జిందగీ’ పలుకరించింది.

Shivlal holds Guinness World Record

– పేద కుటుంబంలో పుట్టాడు..
– కష్ట పడి చదివాడు..

శివలాల్ ది జగిత్యాల్ జిల్లా కేంద్రం. 1982లో తల్లిదండ్రులు గంగాధర్-రాజమణిలకు పెద్ద కుమారుడుగా పుట్టాడు అతను. శివలాల్ కు ఇద్దరు తమ్ముళ్లు రాజకుమార్, రాజశేఖర్ నార్మల్ గా జన్మించారు వారు. అయితే.. శివలాల్ మూడు అడుగులతో మరుగుజ్జుగా జన్మించాడు. బాల్యం నుంచే అతనికి హేళనలు, అవమానలు సర్వ సాధరణం. అయినా ఏ రోజు శివలాల్ ఆత్మస్థాయిర్యం కోల్పొలేడు. జీవితంలో ఎదుగాలంటే విద్య ఒక్కటే మార్గం చూపుతుందని ఉపాధ్యాయులు బోధించిన హీతవును గుర్తు పెట్టుకున్నాడు.

– మరుగుజ్జుగా దేశంలోనే మొదట డిగ్రీ పట్టా..
– కంప్యూటర్ లో పోస్ట్ గ్రాడ్యువేషన్..

జీవితంలో సాధించాలంటే చదువు ఒక్కటే అని శివలాల్ ఆలోచించాడు. మరుగుజ్జుగా దేశంలోనే బికాం డిగ్రీ పట్టా అందుకున్న మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. డిగ్రీ పట్టాతో బతుకు బండి ముందుకు వెళ్లడం కష్టమని భావించాడు శివలాల్.
చదువుతునే మరో వైపు టైప్ నేర్చుకున్నాడు. కంప్యూటర్ యుగంలో తాను ఆఫ్ డెట్ కావాలని ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. కంప్యూటర్ లో పోస్ట్ గ్రాడ్యువేషన్ పూర్తి చేసాడు. ఆ కంప్యూటర్ పరిజ్ఞానం ఇప్పుడు శివలాల్ ఫ్యామిలీకి ఉపాధి.

Shivlal holds Guinness World Record

ఇస్మాయిల్ సహాకారంతో కారు డ్రైవింగ్..
గిన్నిస్ బుక్ రికార్డు

శివలాల్ కు డ్రైవింగ్ చేయాలనే కోరిక. మరుగుజ్జు డ్రైవింగ్ చేయడం సాధ్యం కాదు. అయినా తాను కారు డ్రైవింగ్ నడుపడం నేర్చుకుంటానని హైదరాబాద్ లోని కారు డ్రైవింగ్ సెంటర్ ల చుట్టూ తిరిగాడు. ‘‘మూడు అడుగులు లేడు నీవు డ్రైవింగ్ చేస్తావా..?’’ అంటూ శివలాల్ ను హేళన చేసిన సందర్బాలు ఉన్నాయి. డ్రైవింగ్ నేర్చుకోవాలనే కోరికను తన స్నేహితుడు మెకానిక్ ఇస్మాయిల్ కు చెప్పాడు. అంతే.. కారును శివలాల్ నడుపడానికి అనుకువగా తయారు చేసిన ఇస్మాయిల్ ప్రత్యేకంగా డ్రైవింగ్ నేర్పించాడు. మరుగుజ్జుగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన శివలాల్ ‘‘వండర్ బుక్ ఆఫ్ రికార్డు’’ సాధించాడు.

– భార్య కూడా మరుగుజ్జే..
– ఆధర్శ దంపతులకు బాబు..

శివలాల్ ఉన్నత చదువులు చదివాడు. అయినా సర్కార్ కొలువు లేదరి నిరాశ చెందలేడు. హైదరాబాద్ లో ప్రైవేట్ జాబ్ చేస్తునే పెద్దల సమక్ష్యంలో మెట్ పల్లికి చెందిన చిన్మాయి (మరుగుజ్జు)ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఆధర్శ దంపతులకు బాబు జన్మించాడు. అయితే… భార్య చిన్మాయి సహాకారంతోనే ఈ రికార్డులు సాధించినట్లు చెబుతాడు శివలాల్. భవిష్యత్ లో తన భార్యకు కూడా కారు డ్రైవింగ్ నేర్పిస్తానంటున్నాడు అతను. ప్రభుత్వ సహాయం కోసం తాను కేసీఆర్ ను కలువడానికి చాలా సార్లు ప్రయత్నించిన లాభం లేదంటున్నారు శివలాల్.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

949 222 5111

Shivlal holds Guinness World Record / ZINDHAGI.COM / YATAKARLA MALLESH /CAR DRIVING
Comments (0)
Add Comment