Scientific temperament lacking in teachers
స్కూల్ టీచర్ లలోనూ కొరవడిన సైంటిఫిక్ టెంపర్ !
కలియుగం నుంచి కంప్యూటర్ యుగంలోకి దూసుకెళుతున్నా.. ఇంకా సైన్స్ ను గుర్తించలేక పోతున్నారు. కళ్ల ముందు జరిగే సంఘటనలను సైన్స్ కు వ్యతిరేకంగా విద్యార్థులకు బోధించి వారి చిన్ని మనసును గాయం చేసే అధికారం టీచర్ లకు లేదు కదా.. ఇగో.. అలాంటి సంఘటన గురించి రాజ్యలక్ష్మీ బీరం గారు తన ఫేస్ బుక్ లో పిల్లలకు నిజాలు చెప్పాలని సూచన చేశారు. పిల్లల దినోత్సవం సందర్భంగా తన అనుభవాన్ని షేర్ చేశారు.
వర్షం వచ్చింది
మా పిల్లలు చదివే స్కూల్ లో ఈ రోజు పిల్లల దినోత్సవం వేడుకలు చేశారు. ఉదయం కొంచెం ఎండగా ఉంది కానీ మధ్యాహ్నంకి వర్షం వచ్చే సూచనలు కనపడుతూనే ఉన్నాయి. అందుకని ఉదయం ప్రోగ్రాం పూర్తి చేసి మధ్యాహ్నం క్లాసెస్ జరిగేట్టు ముందు నుంచే నిర్ణయం జరిగింది. అనుకున్నట్టుగానే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వర్షం వచ్చింది. ఈ సందర్భాన్ని వాళ్ళ హెడ్ మిస్ పిల్లలందరి ముందు ఎలా చెప్పిందో వింటే నవ్వాగట్లేదు.
ప్రేయర్ చేస్తే వర్షం ఆగిందా..? “రెండ్రోజుల నుండి ప్రేయర్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం డిస్టర్బ్ అవ్వకుండా పిల్లలందరూ ఎంజాయ్ చేసేలాగ చూడమని, అందుకే ఇప్పటి వరకు వర్షం ఆగింది” అని చెప్పారంట. ఇది వినగానే అనిల్ అన్నయ్య గొంతు పోయేలా అరిచి వర్షాన్ని ఆపిన విషయం గుర్తొచ్చింది. ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారేమో అనుకున్న.
టీచర్స్ కే అవగాహన లేక
మా పిల్లలు ఇంటికి రాగానే ఈ విషయం చెప్పి, “ఇంత చిన్న విషయానికి దేవుడిని రెండు రోజుల నుండి ఇబ్బంది పెట్టక పోతే పెద్ద పెద్ద సమస్యలను సాల్వ్ చెయ్యమని చెప్పొచ్చు కదా !” అంటున్నారు అధ్యక్ష. వర్షం ఎలా పడుతుంది అనే విషయం టీచర్స్ కే అవగాహన లేకపోవడం చాలా బాధాకరం. మనం ఆగి పొమ్మంటే ఆగి పోవడానికి రమ్మంటే రావడానికి అదేమన్నా మన చుట్టమా. అందరికీ, ముఖ్యంగా చదువుకున్న వారికి, అందులోనూ టీచర్లకు “సైంటిఫిక్ టెంపర్ అవసరం” ఎంతుందో చెప్పడానికి ఇటువంటి విషయాలే ఉదాహరణలు. Scientific temperament lacking in teachers