Satish Chander Book- Dice సతీష్ చందర్ బుక్- పాచిక

MY BOOK A DAY-2

Satish Chander Book- Dice
సతీష్ చందర్ బుక్- పాచిక

ఫ్లాష్ బ్యాక్… ఫ్లాష్ బ్యాక్… ఫ్లాష్ బ్యాక్..!!

• ఆలివ్‌గ్రీన్‌ దుస్తుల్లో వుండే ‘అన్న’లు అందరీ మధ్యకూ వచ్చేసి, ప్రభుత్వ అతిథి గృహాల్లో విడిదిచేసి, చర్చలను ప్రారంభించేసి, సర్కారు అభిమతాన్ని బహిర్గతం చేసి అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయారు.

* బుధ్ధుడు పుట్టిన జాడల్ని వెతుక్కుంటూ, దలైలామా మన దేశానికీ, రాష్ట్రానికి వచ్చేశాడు. అవును కదా! బుధ్ధుడు ఇక్కడ పుడితే బౌధ్ధమూ, భౌధ్ధ ప్రవక్తలూ వేరే దేశంలో వుండటం ఏమిటి?

* మరో మారు స్త్రీ (సోనియా గాంధీ) భారత ప్రధాన పదవిని అలంకరించే అవకాశం వచ్చినప్పుడు, ‘స్వదేశీయత’ చర్చకొచ్చింది. అలా జరిగితే ‘గుండు గీయించుకుంటా’నని వేరే పార్టీలో ప్రముఖ మహిళా నేత(సుష్మా స్వరాజ్‌) శపథం కూడా చేశారు.

* దళితుల మీద అగ్రవర్ణాలు దాడి చేయటం ఎప్పుడూ జరిగేదే..! కానీ దళితులే సాటి దళితుల్ని నరికేస్తే..? నీరు కొండ, కారంచేడు, చుండూరులకు భిన్నంగా జరిగిన వేంపెంట విషాదం కొత్త ప్రశ్నలు వేసింది.

* ప్రత్యేక తెలంగాణ సాధనే ధ్యేయంగా పుట్టిన పార్టీ (టీఆర్‌ఎస్‌) నేతలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని(సమైక్య) ‘ఆంధ్రప్రదేశ్‌’ మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు. (తర్వాత కాపురం పొసగలేదనుకోండి!)

* తండ్రిని కోల్పోయిన అంబానీ సోదరులు తగవులాడుకుని వేరు పడితే, భారత్‌ కార్పోరేట్‌ సామ్రాజ్యం రెండు ముక్కలుగా చీలినట్లు భావించింది ప్రపంచం. కానీ తల్లి కోకిలమ్మ తగవు తీర్చారు. ఇంతకీ ఇద్దరూ రెండుగా చీలారా? రెండితలయ్యారా?

* మతాన్నీ, రాజకీయాన్నీ కలిపేస్తే మారణాయుధం పుట్టింది. అది గుజరాత్‌ను దహించింది. మైనారిటీ మీద విద్వేషం పెంచే మెజారిటీయే ప్రజస్వామ్యమా?

ఇంతా చేసి, పదిహేనేళ్ళ క్రిందటి ముచ్చట. చరిత్ర ఎప్పడూ అంతే. జరిగిందే జరుగుతుంది. ఇలా తెరవెనక్కి వెళ్ళి, అలా వేషం మార్చుకు వచ్చేస్తుంది.. గంగలో మునిగినా, కాలంలో మునిగినా ఒక్కటే. ఎర్రదుస్తులతో మునిగి కాషాయం దుస్తులతో రావచ్చు. రాజకీయం ఎప్పడూ అంతే. ఒక పిరియడ్ మూవీ.. చూసెయ్యండి… ఐ మీన్ చదివేయండి.

హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ లోని రైటర్స్ స్టాల్ ( నెం.లు: 152, 153) లో నా పుస్తకాలు వున్నాయి. ’పాచిక‘ అక్కడ కూడా దొరుకుతుంది.

సతీష్ చందర్, రచయిత

Satish Chander Book- Dice / zindhagi.com / yatakarla mallesh / satheesh chander
Comments (0)
Add Comment