MY BOOK A DAY -1
సతీష్ చందర్ బుక్
బూత్ బంగ్లా
ఆ మధ్యే ఎవరో ఎన్నికల్లో అభ్యర్థి వచ్చి
‘వోటు వెయ్యి’ అనడిగాడట! వెంటనే ఒక ముసలమ్మ వచ్చి-
‘ఆ మాట మీదే నిలబడు’ అందట. అప్పుడాభ్యర్ధి అవాక్కయి-
‘నాకు వోటేస్తానని మాటివ్వాల్సింది నువ్వు. మాట మీద నిలబడాల్సింది నువ్వు. నన్ను -నిలబడు- అంటావేమిటి?’ అన్నాడట. అందుకా ముసలమ్మ అందుకుని –
వోటు ‘వెయ్యీ’ అన్నావ్. రేపు నీ మనుషులొచ్చి నా చేతిలో వెయ్యి బదులు, వంద పెడితే, ఎవరూ జవాబు దారీ? నువ్వు కాదా..?’ అని ఎదురు ప్రశ్న వేసింది.
‘ముసలమ్మా! వెయ్యి అంటే నేను వెయ్యి ఇస్తానని కాదు, నిన్ను వోటు వెయ్యమని కోరుతున్నా- అంతే!’ అని చెప్పి జారుకున్నాడు.