గ్రామాల బాట పట్టిన సర్పంచ్ పి.శ్రీలత ఉప సర్పంచ్ చింతకుంట కృష్ణారెడ్డి

AP 39TV 19ఫిబ్రవరి 2021:

తలుపుల మండల కేంద్రంలో ప్రకాష్ నగర్ గ్రామంలో ఈ రోజు మేజర్ పంచాయతీ సర్పంచ్ పి. శ్రీలత ఉప సర్పంచ్ చింతకుంట కృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ సుర్యనారయణ రెడ్డి గ్రామాల బాటపట్టారు గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ వాసులు మాట్లాడుతూ తమ గ్రామంలో కరెంటు స్తంభాలు అదనంగా కావాలనే వారు కోరారు. అలాగే ఏ ఊరి మధ్యలో ఉన్న పెద్ద లైన్ కరెంటు ఉన్నందువలన వర్షం వస్తే తమకు పెద్ద లైన్ కరెంటు కింద ఉన్న ఇళ్లకు ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తమ సమస్యలను గుర్తించి కరెంట్ స్తంభాలను మార్చాలనే వారు వేడుకున్నారు. అలాగే అటువైపు వెళుతున్న సర్పంచులు ఎలిమెంటరీ స్కూల్ నందు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తరగతి గదులు పూర్తిగా దెబ్బ తిన్న గదిలో కూర్చోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.పిల్లలు ఎక్కువ శాతం ఉన్నందున అదనపు గదులు నిర్మించాలనే వారు కోరారు. ఈ కార్యక్రమంలో  రిటైర్డ్ టీచర్ రమణ మౌలాలి ,అంజి, సుబహన్, శ్రీ రాములు ,శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

Comments (0)
Add Comment