SARDAR UDHAM Movie అనన్యసామాన్యమైన సినిమా ‘సర్దార్ ఉధమ్’ 

A PATRIOTIC STORY LIKE NO OTHER – SARDAR UDHAM

అనన్యసామాన్యమైన సినిమా ‘సర్దార్ ఉధమ్’

మన దేశపు సగటు ‘దేశభక్తి సినిమా’ యొక్క బ్లూప్రింట్ ఎప్పుడూ కూడా ఒక కామిక్ బుక్ తరహా హీరోయిజం తాలూకు ఎలిమెంట్లను ఆవాహన చేసుకుని రూపొందుతుందనేది నా ప్రాథమిక అవగాహన. జనరల్‌గా స్వాతంత్ర్య సమరయోధుల గాథలు అందరికీ తెలిసే ఉంటాయి. వారి త్యాగాలూ వేలసార్లు కొనియాడబడి ఉంటాయి. సినిమా అనే మాధ్యమం కూడా అప్పటి సంఘటనల్ని ఒక రొమాంటిసైజ్డ్ టోన్‌లో బుల్లెట్ వేగంతో దూసుకుపోయేంత పేస్‌తో రోమాంచితంగా స్పృశిస్తూ రాయబడ్డ స్క్రీన్‌ప్లేలతో వాటి పరిధిని ఇంకా ఇంకా నమ్మశక్యం కానంత ఎత్తులకి విస్తరించి చెప్పడమనే చట్రంలోనే ఇరుక్కుపోయింది.

ఇదిలా ఉంటే ఇంకోవైపు ఒక వ్యక్తి చరిత్ర నిండా అతిశయోక్తి, ఆడంబరాలు, అద్భుతశక్తులు దట్టిస్తారు. మరీ ‘దేశభక్తి’ పేరిట భ్రాంతి ప్రపంచాలను నిర్మించేసి సొమ్ము చేసుకున్న సినిమాలూ మనదగ్గర తక్కువేం కాదు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ సంగతే తీసుకుంటే ఇలా ఏమాత్రం నిజాయితీ లేని జింగోయిస్టిక్ ప్రదర్శనలు తప్ప ఇంకా మన మెదడు పొరల్లో నివురుగప్పిన నిప్పులా రగులుతున్న బ్రిటిష్ కలోనియలిజం తాలూకు భయానక స్మృతుల్ని అల్మరాలో మూలన కుళ్లిపోతున్న ఒక శవమంత పచ్చిగా, నిక్కచ్చిగా ఇప్పటిదాకా ఏ సినిమా కూడా ఆవిష్కరించలేదు (నాకు తెలిసి). అదీగాక ముఖ్యమైన మైల్‌స్టోన్‌ సంఘటనల వల్లనే చరిత్ర ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కాబట్టి వాటిమీదే ఫోకస్ సారించడంవల్ల స్వాతంత్ర్య సమరయోధులలో బ్రిటిష్ సామ్రాజ్యం పట్ల నిలువెల్లా ధిక్కారం నిండటానికి గల కారణాలు, దోహదపడ్డ విషయాలు, ప్రేరణలు చాలా మటుకు మరుగున పడిపోతాయి. SARDAR UDHAM Movie

ఈమేరకు దర్శకుడు సుజిత్ సర్కార్ తీసిన ‘సర్దార్ ఉధమ్’ ఒక అనన్యసామాన్యమైన సినిమా అని ఒప్పుకోవాలి. ఎందుకంటే కథనంలో పైన చెప్పుకున్న ‘జనరంజకంగా’ అనిపించే అంశాలు ఎన్నో చొప్పించే స్కోప్ పుష్కలంగా ఉన్నప్పటికీ చరిత్రను ఆవిష్కరించే క్రమంలో ఈ సినిమా చూపిన నిజాయితీ, ఓపిక, దాని యాంబిషన్, అసలు దాన్ని చెప్పడానికి ఎంచుకున్న ఫిల్మ్ గ్రామర్.. ఇవన్నీ దీన్ని ఒక గొప్ప సినిమాగా నిలబెడతాయని నా అభిప్రాయం.

సర్దార్ ఉధమ్ సింగ్. విప్లవం, పగ – రెండిటినీ తన నరనరాల్లో నింపుకున్నవాడు. 1919 జలియన్‌వాలా బాగ్ నరమేధానికి కారకుడైన అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ Michael O’Dwyerను కాల్చిచంపిన కారణంగా మాత్రమే మనకు తెలిసినవాడు. అయితే ఆయనను కేవలం ఆ ఒక్క సంఘటనకే కుదించేయకుండా సినిమా ఒక slow burn తరహాలో, ఒక proceduralలాగా ఆయన జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం చేస్తుంది. ఉధమ్ ఆ మాజీ గవర్నర్‌ను బ్రిటిష్ సామ్రాజ్యపు ఆయువు పట్టైన లండన్ నగరం నడిబొడ్డునే కాల్చివుండొచ్చు, అది పదిహేను దేశాల న్యూస్‌పేపర్లలో హెడ్‌లైన్‌గా కూడా వచ్చివుండొచ్చుగాక. కానీ డైరెక్టర్ యొక్క ప్రయారిటీ అది కాదు. ఉధమ్ ఆ హత్య చేసిన విధానాన్ని విశ్లేషించడమా లేక ఆయన మనస్తత్వాన్ని ఓపిగ్గా అన్వేషించడమా అనే ప్రశ్నవస్తే సుజిత్ సర్కార్ రెండో మార్గాన్నే ఎంచుకున్నాడు. అందుకే హత్య తాలూకు డీటెయిల్స్ అన్నీ క్లైమాక్స్‌లో ఒక dramatic crescendoలా కాకుండా సినిమా మొదట్లోనే వచ్చేస్తాయి.

సాధారణంగా స్వాతంత్ర్య సమరయోధులనగానే అసమాన ధైర్యసాహసాలతో నిస్వార్ధంగా పోరాడుతూ ప్రాణాలర్పించే ఒక vigilante stereotype గుర్తొస్తుంది. In fact, భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్, ఖుదిరాం బోస్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, ప్రీతిలతా వడ్డేదార్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాణ త్యాగం పట్ల వారి desperation వాళ్ల లెక్కచేయనితనానికి, తమ చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఒకింత లెక్కలేనితనానికి నిదర్శనంగా కూడా చాలామందికి అనిపించవచ్చు. ఏం? ఎందుకు యవ్వనంలోనే చనిపోవడం? బ్రతికుంటే ఇంకా ఎక్కువే సాధించగలిగే అవకాశం ఉండేది కాదా? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. అయితే దీన్ని సుజిత్ సర్కార్ అడ్రస్ చేసిన విధానం అద్భుతం. SARDAR UDHAM Movie

నేను సుజిత్ సర్కార్ సినిమాలన్నీ చూశాను. ఈ జీవన్మరణ సంఘర్షణని ఆయన ముందే జిమ్మీ షెర్‌గిల్ హీరోగా వచ్చిన ‘యహా’ (2005), జాన్ అబ్రహాం హీరోగా వచ్చిన ‘మద్రాస్ కెఫె’ (2013)లలో స్పృశించాడు కానీ I must admit, this film exists on a whole other planet. The sheer scale of this film is baffling, its attention to detail so spot on and life-like. ఉదాహరణకి ఒక సీన్లో ఉధమ్ మాజీ USSR దేశంలో ఎక్కడో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆయన నడకని పక్కనే ట్రాక్ చేస్తూ వస్తున్న కెమెరా డాలీ కాస్తా ఆయన చుట్టూ తిరిగి ఏరియల్ వ్యూ కోసం గాల్లో పైకి లేస్తుంది. నలువైపులా మంచు విశాలంగా పరుచుకునివున్న ఆ మైదానంలో ఆయన చంద్రుడిపై చిన్న నల్లటి మచ్చలా insignificantగా కనబడతాడు. ఇక్కడ సర్కార్ కెమెరా యొక్క లక్ష్యం ఆ ప్రకృతి అందాలను బంధించడం కాదు. ఆ ఫ్రేమ్ నిండా ఉధమ్ అనుభవిస్తున్న వేదన కనబడుతుంది. ప్రపంచంలో ‘తన’ అనుకున్నవాళ్లందరూ చనిపోగా తానొక్కడే ఒంటరిగా బ్రతికిపోయానన్న అపరాధభావన కనిపిస్తుంది.

O’Dwyer మీద పగతీర్చుకునేందుకు ఉధమ్ దాదాపు రెండు దశాబ్దాలపాటు వేచిచూడవలసివచ్చింది. అయితే ఈ కాలాన్ని కథనానికి అవసరం లేని విషయాలుగా తీసిపారేయకుండా ఇరవయ్యేళ్లలో తన గమ్యానికి తనను చేరువ చేయని ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక క్షణం..ఉధమ్ యొక్క పగిలిన గుండె, దిక్కుతోచని అతని మనసు ‘లక్ష్యసాధన’ కోసం, తద్వారా లభించే ‘మోక్షం’ కోసం ఎలా పరితపించిపోయాయో చూపడానికి వాడుకుంటుంది సినిమా. చరిత్ర మనమీద మోపిన అపారమైన బాధనూ, వేదననీ నెమ్మదిగా ఈదుకుంటూ వెళ్లాలని ఎవరికుంటుంది చెప్పండి? అందుకే చాలా దేశభక్తి సినిమాలు injustice వలన కలిగిన దుఃఖం నుంచి వెంటనే నేరుగా revenge వలన కలిగే ఆనందాతిరేకాల వద్దకు వెళ్లిపోవడానికే ఇష్టపడతాయి. కానీ సర్కార్ ఇందుకు ససేమిరా ఒప్పుకోడు. ఇంచ్ బై ఇంచ్, సెకన్ బై సెకన్…చరిత్ర శిథిలాల్లో నెత్తురోడిన ఆ పంజాబ్ నేల గుండా, పీడకల లాంటి ఆ నరమేధం గుండా మనల్ని లాక్కెళతాడు. SARDAR UDHAM Movie

సినిమా యొక్క చివరి గంటసేపు ఫుటేజ్ బహుశా మన దేశంలో నిర్మింపబడ్డ అతిముఖ్యమైన, అత్యంత బాధాకరమైనా కూడా మోస్ట్ ఐకానిక్ క్షణాలుగా మిగిలిపోతాయని నా అభిప్రాయం. ఉధమ్ అదృష్టవశాత్తూ ఆ జనసంహారం నుంచి తప్పించుకుంటాడు. ఆ రాత్రి మొత్తం ఆ మైదానంలో కొనవూపిరితో మిగిలిన వాళ్లను తన భుజాలపైనా, తోపుడుబండిపైనా, అందుబాటులో ఏది దొరికితే దానిపైనా ఎక్కించుకుని హాస్పిటల్ చేరుస్తూ గడుపుతాడు. అతనలా శవాలను, శరీరభాగాలు తెగిపడిన చిన్నపిల్లలు, ఆడవాళ్లను మోస్తుంటే బ్యాగ్రౌండ్‌లో ఒక స్వరం ‘కోయీ జిందా హై?’ (ఎవరైనా బతికున్నారా?) అని దీనంగా వినబడుతుంటుంది. It’s the numbing length, the sheer observational quality of this sequence that makes it as agonizing as it is affecting. మొదటిసారి ఆ రోజు జరిగిన విలయంలోకి, ఆ వయలెన్స్ తాలూకు హారర్‌లోకి మనల్ని కాలర్ పట్టుకుని బరబరా ఈడ్చుకెళ్లినట్టుంటుంది. నరమేధాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా చరిత్ర వాటి పక్కన కొన్ని ‘అంకెలను’ జతచేసి పక్కకు తోసేస్తుంది. కానీ సర్కార్ కెమెరా మాత్రం గుట్టలుగా పడివున్న శవాలు, చెల్లాచెదురుగా పడిన వందలాది బుల్లెట్ షెల్స్, విరిగిన ఎముకలు, ఛిద్రమైన పేగులు, ఏరులైపారుతున్న రక్తం..వెరసి ఒక సగటు ప్రేక్షకుడు దేని జ్ఞాపకంతో అయితే హాల్ వదిలివెళ్లాలనుకోడో వాటిమీదే తిరుగుతుంది. ఓటీటీ రిలీజ్ కాబట్టి మన ఇంటి యొక్క భద్రమైన వాతావరణం దాటుకొచ్చి మరీ ఈ దృశ్యాలు మనల్ని చాలాకాలం పాటు వెంటాడతాయి. SARDAR UDHAM Movie

బహుశా ఈ సినిమా సాధించిన అతిపెద్ద విజయం ఏమిటంటే ఉధమ్ సింగ్‌ను ఆత్మవిశ్వాసం నిండిన ఒక రెబెల్‌గా మాత్రమే కాక బాహ్య ప్రపంచపు అందాల్ని ఆస్వాదించలేనంతగా దెబ్బతిన్న ఒక మనిషిగా చూపించి ఆయనను ‘హ్యూమనైజ్’ చేయడమేనని నా అభిప్రాయం. లడ్డూల మీద ఆయనకున్న ఇష్టం, భగత్ సింగ్‌తో ఆయన అనుబంధం..subtleగా ఉన్నా అవి ఒక గొప్ప బాధ, వేదన తర్వాత కరుగ్గా మారిన బాధితుడి గుండె ఎప్పుడో కోల్పోయిన తన హ్యుమానిటీకి గుర్తులు. విక్కీ కౌశల్‌కి బహుశా ఇది రోల్ ఆఫ్ ది కెరీర్. He shines brilliantly as a bitter and disillusioned man rifling through streets of London, snowy meadows of Russia, and the fields of Punjab.

సర్దార్ ఉధమ్ సినిమా అసలు ఎంటర్టైన్మెంట్ కాదు. ఇది ఇతిహాసాలను తీర్చిదిద్దే దిక్సూచి. కథల్లోని పాత్రల కోసం ఏకంగా మనుషులను చంపుకుంటున్న దేశంలో అసలు వాస్తవాల ఆధారంగా చరిత్రను తెరకెక్కించే విధానం ఇది. కష్టమైనా, నష్టమైనా..లేని గొప్పలకు పోకుండా, జరిగిన అన్యాయాలను పలుచన చేయకుండా నిజాయితీగా మన గతానికి మన సినిమా ఒక సాంస్కృతిక క్షణాన్ని ధారపోసే పద్ధతి ఇదీ!

(కల్పిత కధలు, పుక్కిట పురాణాల్లోని వ్యక్తుల పేరిట మూక హత్యలకు పాల్పడుతున్న దేశంలో,పరాయి మతస్తులను ద్వేషించడమే దేశభక్తిగా చలామణి అవుతున్న పుణ్యభూమిలో కాస్తంత తెలివిడి లోకి తెచ్చే ఈ SARDAR UDHAM Movie సినిమా అమెజాన్ ప్రైమ్ లో తప్పక చూడండి.)

Karthik K

SARDAR UDHAM Movie/ zindhagi.com/ zindhagi tv/ yatakarla mallesh
Comments (0)
Add Comment