Salute to mothers on duty with suckling babies తల్లులకు సెల్యూట్

Salute to mothers on duty with suckling babies

చంటి బిడ్డలతో డ్యూటీ చేస్తున్న తల్లులకు సెల్యూట్

నిజమే.. అమ్మ ప్రేమను ఎంత వర్ణించిన అక్షరాలు తలవంచాల్సిందే. సృష్టికి మూలం ఆ అమ్మే.. అందుకే మాతృదేవో అంటూ అమ్మ గౌరవం పెంచారు పెద్దలు. ఆపదచ్చిన.. కష్టాలచ్చిన మొదట తలుచుకునేది అమ్మనో.. అవ్వనో.. మమ్మి అనో.. అందుకే ఆ మాతృమూర్తికి తలవంచి సెల్యూట్ చేయాల్సిందే కదూ.. బిడ్డకు ఆకలైతే ముందే ఆ తల్లికే తెలుస్తోంది. ఆ ఆకలిని గుర్తించిన తల్లి రొమ్ము పాలు ఇవ్వడానికి అక్కడ ఎవరున్నారని ఆలోచన చేయదు. అది తల్లి ప్రేమ. చంటి బిడ్డ పెరిగి సక్సెస్ వైపు పరుగులు పెడుతుంటే కూడా తండ్రి కంటే తల్లి  ఆత్మస్థైర్యమే ఎక్కువ.. తల్లి అంటే ఓ అనుభూతి.. అనుబందం.. అప్యాయత.. అన్నీ తల్లే.. ఈ ముచ్చట గిప్పుడు మీకు ఎందుకు చెబుతున్నాను కుంటున్నారా..? చంటి బిడ్డతో డ్యూటీ చేసే ఓ  పోలీసు అధికారిణి కథ చెప్పడానికే…

భుజన చంటి పిల్లోడు.. డ్యూటీ చేసిన పోలీసు తల్లి..

ఆమెకు విధులంటే ప్రాణం.. ఆ విధుల తరువాతే ఏదైనా.. కానీ.. చంటి పిల్లోడుంటే..? అయినా.. ఆ పిల్లోడితోనే విధులు నిర్వహించి శబ్బాష్ అనిపించుకుంది వరంగల్ డిప్యూటి పోలీసు కమీషనర్ పుష్ప. దసరా పండుగా సందర్భంగా రంగలీల మైధానంలో నిర్వహించిన బందోబస్తు పర్యావేక్షణలో చంటి బిడ్డతో కనిపించిన ఆ తల్లి ప్రేమకు చాలా మంది ఫిదా అయ్యారు. చంటి బిడ్డ.. విధుల నిర్వహణ ఈ రెండునూ ఇష్టంగా ప్రేమించే ఆ పోలీసు అధికారిణి పుష్ప స్ట్రీక్ట్ ఆఫీసర్.. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఆ తల్లి ప్రేమను చూసి చలించి పోయాడు. అతను ‘అమ్మతనం’ పేరుతో రాసిన కవిత్వం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసు అధికారిణిగా ప్రతి క్షణం పని ఒత్తిడిలో ఉన్నా.. చంటి బిడ్డను భుజన వేసుకుని శాంతి భధ్రతల పర్యావేక్షణను మౌణ మునిలా విధులు నిర్వహించిందని పేర్కొన్నారు. అన్యాయం జరిగిందని ఆ తల్లి వద్దకు వెళ్లితే.. తప్పు చేసినోడు ఎంతటి అధికార, ధన బలం ఉన్న న్యాయం చేస్తూ వరంగల్ జిల్లా ప్రజల మెప్పు పొందుతున్న డిసిపి పుష్పకు సెల్యూట్ చేస్తున్నారు ప్రజలు. ఆమె డిసిపిగా బాధ్యతలు తీసుకున్న తరువాత పోలీసు అధికారులలో అవినీతి తగ్గింది.. ఫైరావీలు తగ్గాయి. కరడు గట్టిన నేరస్థులకు కౌన్సిలింగ్ ఇస్తోంది. ఆపదలో ఉన్న వారికి అర్ధరాత్రైన హెల్ప్ చేస్తోంది. ఇదంతా  చంటి బిడ్డతో విధులు నిర్వహించే  పోలీసు అధికారిణి కమ్  తల్లి గొప్పతనంకు సెల్యూట్ చెబుదాం..

***    ****

కోరోన కాలంలో చంటి బిడ్డతో డ్యూటీ చేసిన కలెక్టర్..

మీకు ఇంకోముచ్చట చెప్పాలి. వరంగల్ డిసిపి పుష్పలా చంటి పిల్లోడితో డ్యూటీ చేసేటోళ్లు చాలా మంది తల్లులే ఉన్నారు. ఈ మధ్య వచ్చిన కరోన టైమ్ లో చంటి బిడ్డను ఎలా చూసుకుంటారో డ్యూటీని కూడా అలాగే చూసుకునే తల్లులు కనిపించారు. ఆ కరోనా కాలంటో పెద్దోళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ప్రాణ భయమే.. కానీ.. గీ కలెక్టర్ కన్న బిడ్డను వెంట పెట్టుకుని డ్యూటీ చేసి శబ్బాష్ అనిపించుకుంది. నమ్మడం లేదా.. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ మోదీ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సౌమ్యా పాండే ఒక జిల్లాకు నోడల్ అధికారిణిగా పని చేస్తోంది. ఆ తల్లికి ప్రసవంతో సిజేరియన్ ఆపరేషన్ జరిగినా డ్యూటీ ముఖ్యం అనుకుంది. చంటి బిడ్డను చంకలో పెట్టుకుని పది మందికి కరోనా టైమ్ లో హెల్ప్ చేసింది ఆ తల్లి. మెటర్నిటీ లీవులు ఉన్న తీసుకోకుండా కరోనాను ప్రజలను రక్షించడమే ముఖ్యమనకుందెమో.. ఆఫరేషన్ కోసం 22 రోజలు లీవ్ తీసుకున్న సౌమ్య పాండె డెలివరి అయిన రెండు వారాలకే చంటి బిడ్డతో డ్యూటీ చేయడం ఆమె హెల్పింగ్ నేషర్ కు హృదయం ఉన్న ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయాల్సిందే..

ఈ తల్లి గీత కూడా విధుల నిర్వహణ ముఖ్యమని చంటి బిడ్డతో డ్యూటీ చేస్తోంది. ఇగో గిట్ల మానవత్వంతో డ్యూటీ చేసేటోళ్లు చాలా మందే ఉన్నారు.

తల్లుల ప్రేమకు తలవంచి సెల్యూట్ చేస్తూ…

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Salute to mothers on duty with suckling babies/ zindhagi.com/ yatakarla mallesh/ lady police officer / lady collector
Comments (0)
Add Comment