మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆధ్వర్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ త్యాగమూర్తులకు సెల్యూట్

ఏపీ39టీవీ న్యూస్
జూన్ 7
గుడిబండ:-
ప్రణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ త్యాగమూర్తుల ను అభినందిస్తూ వారికి ప్రశంసాపత్రాలను అందించేం దుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మేరకు మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మద్దనకుంట ఈరన్న ఆదేశాల మేరకు మీరే మా హీరోలు మీకు మా సెల్యూట్ అంటూ గుడిబండ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం గుడిబండ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ వెంకటచిరంజీవి వైద్య సిబ్బందికి. పోలీస్ సిబ్బందికి. ఆశావర్కర్లకు. పరిశుద్ధ కార్మికులుకు .తెలుగుదేశం నాయకులు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ దళిత సీనియర్ నాయకులు.ఫలారం భూతన్న.లక్ష్మీకాంతప్ప. మండల పరిషత్ మాజీ వైస్ ఎంపీపీ తిప్పేస్వామి రఘు.మందలపల్లి నరసింహప్ప.మహలింగప్ప. భోజరాజు.తెలుగుదేశం పార్టీ యువనాయకులు తిమ్మరాజు. నవీన్.నరసింహమూర్తి. సిద్దేష్ యంజేరప్ప.మంజునాథ్. హనుమంతరాయప్ప తదితరులు పాల్గొన్నారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Comments (0)
Add Comment