Salutations to Sri Ramoju Haragopal Guru
శ్రీరామోజు హరగోపాల్ గురువు గారికి ప్రేమతో..
శ్రీరామోజు హరగోపాల్.. తెలంగాణలో కొత్త చరిత్రను పరిచయం చేస్తున్న గొప్ప పరిశోధకుడు.. కలంతో హృదయాన్ని స్పందింపచేసే కవి.. సమాజాన్ని చదివి ఇతరులతో షేర్ చేసుకునే ఫ్రెండ్లి నేషర్ ఇలా ఆ పెద్దాయన గురించి ఎంత చెప్పిన తక్కువే.. ‘జిందగీ’ వెబ్ సైట్ ప్రారంభించిన సోషల్ మీడియా వైపు దృష్టి పెట్టినప్పుడు కనుమరుగైన తెలంగాణ చరిత్రను రాస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతున్న శ్రీరామోజు హరగోపాల్ గారు కనిపించారు. అతను రాసిన ప్రతి కవిత్వం.. వ్యాసం నేటి తరం ఆలోచించాల్సిందే.. మరీ.. ఆ పెద్దాయన రచనలను వాడుకోవాలంటే..?? అనుమతి తీసుకోవడం నైతికత..
శ్రీరామోజు హరగోపాల్ ప్రొఫైల్ ను పరిశీలిస్తే నల్గొండ జిల్లా ఆలేరులో నివాసం.. ఆ వెంటనే వచ్చిన ఆలోచన భువనగిరి జిల్లా ‘సాక్షి’ జిల్లా రిపోర్టర్ నర్సింహులు. జర్నలిస్ట్ గా నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ఆధర్శ భావాలతో బతికే నర్సింహులంటే నాకు వల్ల మాలిన ప్రేమ. మా ఇద్దరి మధ్య జర్నలిస్ట్ గా సోదర భావం.. 2006లో ‘వార్త’ దిన పత్రికలో భువనగిరి రిపోర్టర్ గా నేను.. ఆలేరు రిపోర్టర్ గా అతను పని చేసిన అనుభవంతో ఫోన్ చేసాను.
అంతే.. క్షణం ఆలోచించకుండా ‘శ్రీరామోజు హరగోపాల్ సార్’ మా గురువు గారు అన్నారు నర్సింహులు. మరో మాట మాట్లాకుండా నెంబర్ తీసుకుని కాల్ చేసాను. శ్రీరామోజు హరగోపాల్ గురువు గారితో మాట్లాడాను. ఆ పెద్దాయన మాటలకు ముగ్దుణ్ణి అయ్యాను. జిందగీ వెబ్ సైట్ లో ఒక్కక్షఫం ఆలోచించకుండా ‘తెలంగాణలో కొత్త చరిత్ర’ను రాయడానికి అంగీకరించారు. ఉపాధ్యాయులుగా సమాజంలోని మంచి-చెడులను విద్యార్థులకు బోధించి పదవీ విరమణ చేసిన ఆ పెద్దాయన మరిచి పోయిన ఈ తెలంగాణలో కొత్త చరిత్రను తవ్వడంలో బిజీగా ఉన్నారు. ‘జిందగీ’ పాఠకుల కోసం ప్రతి రోజు సీరియల్ గా తెలంగాణ చరిత్రను అందిస్తాం..
శ్రీరామోజు హరగోపాల్ గురువు గారు ప్రేమతో ‘జిందగీ’ లో రాయడానికి అంగీకరించిన మీకు పాదాభివందనం..
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
సెల్: 9492225111