జడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికలలో పాటించాల్సిన నిబంధనలు

AP 39TV 03ఏప్రిల్ 2021:

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న జడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికలలో పోటీ అభ్యర్థులు, వారి తరుఫు వారు ప్రచార సమయంలో పాటించాల్సిన నిబంధనలు గురించి పోలీసులు ముందస్తుగా సమావేశాలు నిర్వహించి పోటీ అభ్యర్థులు, వారి తరుఫు వారికి తెలియజేస్తున్నారు.

** పోలీసుల సూచనలు..

ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవచ్చు. ప్రార్ధనా స్థలాలు, మందిరాల వద్ద ప్రచారం నిర్వహించకూడదు.  అభ్యర్థులు వాడే వాహనాలు మరియు సౌండ్ సిస్టంనకు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. అభ్యర్థులు ఎవరు కూడా ఒకరినొకరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసుకోరాదు.సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకూడదు.  పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారం ఆపివేయాలి.
పోలింగ్ ఏజెంట్లుగా వేళ్లే వారు ఎలాంటి నేర చరిత్ర కల్గి ఉండరాదు.  పోలింగ్ రొజున  పోలింగు స్టేషన్ కి 200 మీటర్ల దూరంలో ఎవరు కూడా ప్రచారం నిర్వహించకూడదు.  పోటీ చేసే అభ్యర్థులు ఎవరు ఓటర్లను ప్రభావితం చేయకూడదు.  ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసువారి దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేసుకోవాలి. గొడవలు, ఘర్షణలకు దిగరాదు.
ఏవేని సమస్యలు ఉంటే సంబంధిత పోలీసులు లేదా డయల్ – 100 లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూం 9989819191 లకు సమాచారం చేరవేయాలి.

Comments (0)
Add Comment