విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాల క్లాసులు

హైదరాబాద్ : హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫాసిజం – సాంస్కృతిక ప్రతివ్యూహంపై విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహిస్తున్నట్లు విరసం నేత అరసవిల్లి క్రిష్ణ తెలిపారు.

జనవరి 7, 8వ తేదిలలో ప్రారంభమయ్పయే క్లాసులలో ప్రారంభోపన్యాసం  హిమాంశు కుమార్ చేస్తారన్నారు. కీనోట్ పేపరును పాణి సమర్పిస్తారన్నారు.

శివరాత్రి సుధాకర్, సిఎన్ ఆర్ ప్రసాద్, ఆకార్ పటేల్, మల్లారెడ్డి, శివారెడ్డి, ఖాదర్ మోహినుద్దీన్ సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబా, జిలుకర శ్రీనివాస్, ఎన్ వేణుగోపాలు, ఎండ్లూరి మానస,  భూపతి వెంకటేశ్వర్లు, రాపోలు సుధర్శన్, దివికుమార్, రమా సుందరి, అరుణోదయ విమల, బి. అనురాధ, మెట్టు రవీంధర్, ఎన్ ఎ డేవిడ్, డాక్టర్ కాసుల లింగారెడ్డి తదితరులు పాల్గొంటారన్నారు.

ఫాసిజం – సాంస్కృతిక ప్రతివ్యూహం

జాతీయ దురహంకారం  లేని

దేశీయ దభిమానం లేని

ఎల్లలూ లకేవల మట్టి పెళ్లలూ అవని

క్రమశిక్షణా హద్దులు సరిహద్దులూ చెరిపిన

మహోన్నత మానవతా అంతర్జాతీయత  నాది 

అవును నేను నా దేశం గురించి మాట్లాడుతున్నాను

 

ప్రశ్నించినందుకు ఇక్కడ నేను ‘దేశద్రోహి’ ని

బానిస సంకేళ్లను ఛేదించే ఖడ్గాన్నయినందుకు 

నేనిక్కడే బందీని

  • విప్లవ కవి :  (ఎన్ కె)

 

Revolutionary Writers Association Literary School Classes
Comments (0)
Add Comment