రేవంత్ కు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్య‌ర్థుల విన‌తి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎస్ఐ, కానిస్టేబుల్ సమస్యల పరిష్కార పోరాట సమితి తమ సమస్యలపై ధర్నా చౌక్ వద్ద వినతి పత్రం అందించింది.

తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.

పోలీస్ ఉద్యోగ నియామకాలపై గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశాన‌ని, న్యాయం జ‌రిగే వ‌ర‌కు కాంగ్రెస్ అండ‌గా ఉంటుంద‌ని రేవంత్ హామీ ఇచ్చారు.

ఏ నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నియామకాల కోసమే మళ్లీ ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్ధితి రాష్ట్రంలో ఉంద‌న్నారు రేవంత్.

రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా తెలంగాణ అధికారిని కాకుండా ఇత‌రుల‌ను నియ‌మించార‌ని,
కీలక శాఖలన్నింటిలో తెలంగానేతరులను నియమించారని విమ‌ర్శించారు. తెలంగాణ‌ ప్రాంతంపై ఆ అధికారులకు ప్రేమ, అభిమాననం ఏదీ లేదన్నారు. పరిపాలన అందించడానికి తెలంగాణ అధికారులకు సమర్ధత లేదా అని రేవంత్ ప్ర‌శ్నించారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ఆ అధికారులకు పట్టింపు లేదని చెప్పారు. తెలంగాణ అధికారులను, ప్రజలను కేసీఆర్ నమ్మడం లేదని, తెలంగాణ ప్రజల్ని అవమానించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. స‌రైన ప‌ద్ధ‌తిలో నియామకాలు చేపట్టకపోతే ప్ర‌జ‌లు కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టడం ఖాయమ‌ని హెచ్చ‌రించారు.

Request of SI Constable candidates to Revanth Reddy
Comments (0)
Add Comment