ఫీజుల భారాన్ని తగ్గించండి-ఏఐఎస్ఎఫ్

AP 39TV 23 ఫిబ్రవరి 2021:

కరోనా సమయంలోనూ కాషన్ డిపాజిట్ పేర్లతో విద్యార్థులపై ఫీజుల భారాన్ని పెంచడాన్ని నిరసిస్తూ మంగళవారం నాడు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్కేయూ రిజిస్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ కాషన్ డిపాజిట్ల పేరుతో విద్యార్థులపై ఫీజులు పెంచే నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసలే అనంతపురము జిల్లా నిత్యం కరువు కాటకాలకు నిలయమైనదని ఇదే తరుణంలో కరోణ మహమ్మారి వ్యాప్తి చెందడంతో ప్రజలంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతుంటే విద్యార్థుల వెసులుబాటు కొరకు పాత ఫీజుల్లోనే రాయితీ ఇవ్వాల్సింది పోయి ఫీజులు పెంచడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా తక్షణం ఫీజుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కరోనా తీవ్ర వ్యాప్తి సందర్భంలో ఎస్కే యూనివర్సిటీ లో వసతి గృహాలను ఐసోలేషన్ కేంద్రంగా మార్చారని ఇప్పుడు యూనివర్సిటీ ప్రారంభించడంతో విద్యార్థులకు శానిటేషన్ మరియు సున్నంతో పరిశుభ్రత చేయకుండా విద్యార్థులకు వసతి గృహాలు కేటాయిస్తున్నారని, దాని వలన విద్యార్థులకు ఇన్ఫెక్షన్ జరిగి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు, తక్షణం శానిటేషన్ మరియు సున్నంతో పరిశుభ్రత చేయించి వసతి గృహాలను విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేశారు, యూనివర్సిటీ ప్రారంభం కావడంతో కౌన్సిలింగ్, సర్టిఫికెట్లు, పరిశోధక తోపాటు, దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకి భోజన సౌకర్యాలు లేక యూనివర్సిటీ బయట అధిక రేట్లు ఉండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందువలన యూనివర్సిటీలోని జన్మభూమి క్యాంటీన్ను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ యూనివర్సిటీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వీరు యాదవ్, రమణయ్య, నాయకులు రజనీకాంత్, శ్రీ రాములు, బాబా తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment