మానవత్వం మూర్తీభవించిన మంచి మనిషి
“రావిపూడి వెంకటాద్రి (101 ) గారు ఇక లేరు..!!
*శతాధిక వసంత మూర్తికి కన్నీటి నివాళి..!!
ఈమధ్య ఒక చీరాల మిత్రుడితో అన్నాను…
రావిపూడి వారిని కలవాలని..ఈరోజు ఆయన
లేకుండాపోయారు..అందుకే అనుకున్నప్పుడే
మనుషుల్ని కలవాలి.రోజు మారితే ఎవరుంటా
రో ? ఎవరండరో చెప్పలేం.ఈ మానవ జీవితం…
బుద్భుద ప్రాయమని ఊరికే అన్నారా?
హేతువాది,మానవతావాద ఉద్యమాలకార్యకర్త
రావిపూడి వెంకటాద్రిగారు9 ఫిబ్రవరి 1922 న
జన్మించారు.21-01-2023 న చీరాలలో కాలం
చేశారు.చదువుకునేటప్పుడే వీరి పుస్తకాలు చది
వాను.తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు
పోరాడారు..శతాధిక వర్షాలు పరిపూర్ణమైన జీవి
తం గడిపారు.
1922లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని… నాగండ్ల లో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు.1940లో త్రిపురనేని రామ స్వామి రచించిన “శంబుకవధ” చదివి హేతువాదంవైపు
మొగ్గారు.ఆంధ్ర ప్రదేశ్ హేతువాద సంఘం వ్యవ
స్థాపక అధ్యక్షులుగా రావిపూడి ఎప్పుడూ గుర్తుం
డిపోతారు.1989లో రేషనలిస్ట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (RAI)కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యా
రు..1993లో హేతువాద మానవవాద (HEMA) సంస్థను స్థాపించారు రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్)ను స్థాపించారు.
1943లోరావిపూడి కవిరాజాశ్రమం స్థాపనలో
క్రియాశీలపాత్ర వహించారు.మానవతావాది..
ఎంఎన్ రాయ్ శిష్యుడిగా,ఆయన నిర్వహించిన అధ్యయన శిబిరాలకు ఆయన హాజరయ్యారు.
నాగండ్ల పరిసర ప్రాంతాల్లో హేతువాద ఆలోచన
లను ప్రచారం చేశారు. సైన్స్,మతం, హేతువాదం
మార్క్సిజం , భౌతికవాదం , నాస్తికత్వం తదితర
విషయాలపై విస్తకతంగా రచనలు చేశారు..90 కి పైగా పుస్తకాలు,(23సంపుటాలు)రాశారు..వీటిలో
ఆరు పుస్తకాలు ఆంగ్లంలోకి అనువదించబడి
నాయి.హేతువాదం అనే శీర్షికతో హేతువాదంపై తొలి పుస్తక రచయిత రావిపూడివారే కావడం…
విశేషం.హ్యూమనిస్ట్ కాన్ఫరెన్స్‌లలో పాల్గొనేందు
కు ఆయన అమెరికా మరియు యూరప్‌లలో పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంకొల్లులో రాడికల్ హ్యూమ
నిస్ట్ సెంటర్‌ను రావిపూడి స్థాపించారు. రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ రావి సుబ్బారావుగారు దీనికి స్థలాన్నివిరాళంగా ఇచ్చారు.ఈ భవనంలో కాన్ఫరెన్స్ హాల్, అతిథులకు సౌకర్యాలతో సహా గదులు మరియు హేతువాది మాసపత్రిక వెనుక సంచికలతో కూడిన చక్కటి లైబ్రరీ , హేతువాదం, మానవతావాదం మరియు నాస్తికత్వంపై పుస్త
కాలుఉన్నాయి.వీటిలో రావిపూడి వెంకటాద్రి
స్వయంగా రచించిన పుస్తకాలే ఎక్కువగా వున్నాయి.1982 లో “హేతువాది” పత్రికను
ప్రారంభించారు..దీని సంపాదకులు కూడా… రావిపూడివారే…!
రచనలు…
1946లో ఆయన రాసిన తొలి పుస్తకం
“విశ్వాన్వేషణ,”1949 జీవమంటే ఏమిటి?
1960 హ్యూమనిస్టు ఆర్థికవిధానం,1964
భారతదేశం- గోపూజ,1976 ర్యాడికల్ ….
హ్యూమనిజం,1977 నాస్తికత్వం-నాస్తితత్వం,
1977 నాస్తికులున్నారు జాగ్రత్త, 1978 హేతు
వాదం,1978 హేతుత్వం- మతతత్వం,1979
ఇస్లాం- ఒక అంచనా.1991 హేతువాదం…
మానవవాదం..2004 మనస్మృతి మైనస్
అశుద్ధం.2008 ఔనా! వేదంలో అన్నీ ఉన్నా
యా?2010 నాగండ్ల గ్రామ చరిత్ర .
ఆంగ్లంలో…
*Life and soul 1979
*Reason and unreason 1988.
*Why rationalism? 1990.
*Why dialectical materialism
unscientific? 1991
ఇలా 90కు పైగా పుస్తకాలు రాశారు.!
*రాజకీయం..!!
1945లో రావిపూడి వెంకటాద్రి ఎంఎన్ రాయ్ స్థాపించిన రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు . 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఎన్నికలలో బాపట్ల..ఒంగోలు నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయారు నాగండ్ల గ్రామ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై 1956 నుంచి 1996 వరకు 40 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు.ఈ పదవిలో ఉంటూనే గ్రామంలో హేతువాద, మానవతా వాదంతో సమూల మార్పులు తీసుకొచ్చారు.!
నాగండ్లను ఓ చైతన్యవంతమైన గ్రామంగా… తీర్చిదిద్దారు.
*అవార్డులు..
*భారతీయ యుక్తివాది సంఘం వారిచే స్థాపించ
బడిన డాక్టర్ AT కోవూరు జాతీయ అవార్డును అందుకున్నారు.
*2021లో కొండవీటి వెంకటకవి సాహిత్య పీఠం
జీవితకాల సాఫల్యపురస్కారాన్ని అందుకున్నారు.
*ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరులోని చార్వాక కళా
పీఠం నుండి “ఆధునిక చార్వాక జాతీయ అవార్డు”
*కవిరాజు ట్రస్ట్, (హైదరాబాద్) నుండి త్రిపురనేని రామస్వామి జాతీయ అవార్డును అప్పటి భారత ఉపరాష్ట్రపతి KR నారాయణన్ చేతుల మీదుగా అందుకున్నారు.
*1992లో తాపీ ధర్మారావు అవార్డు.( పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం)
*ఒంగోలులోని భారతీయం నుండి”భారతీయు
డు ” అవార్డును స్వీకరించారు.
మానవులకు మార్గదర్శిగా హేతువాదం చేయూ
తనిస్తోందనీ, మూఢనమ్మకాలతోసతమతమవు
తోన్నవారికి వెలుగు చూపుతోన్నదని వెంకటాద్రి గారు చివరి శ్వాస వరకు నమ్మారు..దానికోసమే
పనిచేశారు.
మానవతా విలువలు గుర్తించండి, గౌరవించండి, నిర్భయంగా జీవించండి, సాటి మానవుడిని మానవుడిగా గుర్తించండి ..అంటూ మానవతా
వాదాన్ని ఎలుగెత్తి చాటారు..విస్తృతంగా ప్రచారం
చేశారు.
ఎ.రజాహుస్సేన్, రచయిత