డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘రావణాసుర’ మూవీ
హైదరాబాద్, మార్చి 24 : రావణాసుర’లో రవితేజ గారి నుంచి ప్రేక్షకుల కోరుకునే ఎంటర్ టైన్‌మెంట్ తో పాటు ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ వుంది: రైటర్ శ్రీకాంత్ విస్సా. మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది.
అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అందించిన రచయిత శ్రీకాంత్ విస్సా విలేఖరుల సమావేశంలో ‘రావణాసుర’ విశేషాలని పంచుకున్నారు.
ఎక్కువగా రవితేజ గారి సినిమాలకి పని చేస్తుంటారు.. ఆ కిటుకు ఏమిటి ?
కిటుకు ఏం లేదండీ. మా వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందని అనుకుంటా. నేను చెప్పే కథ ఆయనకి నచ్చుతుంది. ఇక టైగర్ నాగేశ్వర్ రావు విషయానికి వస్తే.. రవితేజ గారు ప్రాజెక్ట్ లోకి రాకముందే దర్శకుడు వంశీతో కలసి ఆ ప్రాజెక్ట్ కి పని చేస్తున్నాను. దానికి నేను మాటల రచయితని. అంతకు ముందు ఖిలాడి సినిమాతో రవితేజ గారితో కలసి పని చేశాను.
ఇప్పటికే చాలా సినిమాలు రాశారు కదా.. మీ బలం ఏమిటి ? మీ జర్నీ గురించి ?
నాకు సినిమాలపై మొదటి నుంచి ఇష్టం వుండేది. రైటింగ్ అంటే ప్యాషన్. సినిమాలకు రాకముందే నేను రాసిన రెండు నవలలు పబ్లిష్ అయ్యాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లాను. తర్వాత సినిమాల్లో పని చేయాలని హైదరాబాద్ వచ్చేశాను. మొదట కొండా కృష్ణం రాజు గారికి ఒక కథ చెప్పాను. ఆయనకి కథ నచ్చింది. ఆయన చైతన్య దంతులూరి గారికి వినిపించారు. ఆయనికీ నచ్చింది. అయితే ముందు ఆయన రాసుకున్నకథకి డైలాగులు రాయమన్నారు. అలా ‘బసంతి’కి రాశాను. అక్కడి నుంచి ప్రయాణం మొదలైయింది.
రావణాసుర ఓ సినిమాకి రీమేక్ అనే ప్రచారం జరుగుతుంది. నిజమేనా ?
కాదండీ. ఏప్రిల్ 7న సినిమా చూడండి..మీకే తెలిసిపోతుంది.
రావణాసుర జోనర్ ఏమిటి ? ఎలాంటి కథ ?
రావణాసుర థ్రిల్లర్. రవితేజ గారి సినిమాలో వుండే ఎంటర్ టైన్ మెంట్, ఎనర్జీ, సాంగ్స్, ఫన్ .. అన్నీ ఎలిమెంట్స్ వుంటూనే ఒక డిఫరెంట్ ఎలిమెంట్ వుంటుంది.
కథ అనుకున్నపుడే ఈ టైటిల్ అనుకున్నారా ?
ఇది రవితేజ గారి కోసం అనుకున్న కథ. ఆయన్ని ద్రుష్టిలో పెట్టుకునే తయారుచేశాం. సినిమా అనౌన్స్ చేయాలనుకున్నపుడు ఈ టైటిల్ అనుకున్నాం.
రావణాసురుడు కొందరి ద్రుష్టిలో హీరో. ఇందులో రవితేజ గారు నెగిటివ్ షేడ్స్ వున్న హీరో అనుకోవచ్చా ?
రావణాసురుడిలో కొన్ని మంచి లక్షణాలు వున్నాయి. అతను తపస్సు చేశాడు. వీణా విద్వాంసుడు. చెల్లెలు అంటే చాలా ఇష్టం. తన రాజ్య ప్రజలని బాగా చూసుకున్నాడు. కాంచన లంక కట్టాడు.
మరి ఇందులో రవితేజ గారి పాత్ర క్యాలిటీలు ఎలా వుంటాయి ?
రావణాసురుడిలో ఎన్ని షేడ్స్ వున్నాయో మా రావణాసురుడిలో కూడా అన్ని షేడ్స్ వున్నాయి.
‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అని ట్యాగ్ లైన్ పెట్టారు కదా ? దిని అర్ధం ?
హీరోలు అనే వాళ్ళే వుండరని అర్ధం. ప్రతి హీరోలో ఒక విలన్ ఉంటాడు ప్రతి విలన్ లో హీరో ఉంటాడు.
అదే కాన్సెప్ట్.
ఈ కథ రాసినప్పుడే సుశాంత్ గారిని అనుకున్నారా ?
నేను కథ చెప్పినపుడు సముద్రఖని లాంటి ఓ క్యారెక్టర్ ని చెప్పాను. కానీ అది డెవలప్ చేస్తుంటే చాలా బాగా వచ్చింది. ఆ పాత్రని ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే ఒక హీరో చేస్తే బావుటుందనే ఆలోచన వచ్చింది. సుశాంత్ అయితే బావుంటుదని సుధీర్ గారు భావించారు. అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. ఆ పాత్రని సుశాంత్ గారు చాలా అద్భుతంగా పోషించారు.
రవితేజ గారు రచయితకి ఇచ్చే సలహాలు ఎలా వుంటాయి ? ఎలా హెల్ప్ అవుతాయి ?
రావణాసుర కథ ఐడియా రవితేజ గారితో డిస్కస్ చేస్తున్నపుడే వచ్చింది. ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ వలనే ఫారియా, రవితేజ గారి మధ్య వచ్చే సీన్స్ ఎక్స్ టార్డినరీగా వచ్చాయి. సెట్ లో షూట్ చేసిన్నపుడు కూడా ఆయన తనదైన వెర్షన్ లో మాటలు, బాడీ లాంగ్వేజ్ యాడ్ చేస్తారు. అవి కథని మరో స్థాయికి తీసుకెళ్తాయి.
సుధీర్ వర్మ గారితో పని చేయడం ఎలా అనిపించింది ?
సుధీర్ వర్మ గారితో పని చేయడం ఇది రెండోసారి. మధ్యలో ఒక సినిమా చేశాం. అయితే దానికి సబంధించిన ప్రచారం ఇంకా స్టార్ట్ చేయలేదు. దర్శకుడిగా ఆయన నాకు చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ బుల్ గా వుంటుంది.
పుష్ప తర్వాత మీరు చేస్తున్న పెద్ద సినిమా రావణాసుర.. ఈ ప్రయాణంలో ఏం నేర్చుకున్నారు ?
నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. అలాగే కొంచెం సున్నితం కూడా. అయితే ముక్కుసూటిగా వుండాలని రవితేజ గారి నుంచి నేర్చుకుంటున్నా. ఆయన ఏదైనా మొహం మీదే చెప్పేస్తారు. ఇలా ముక్కుసూటిగా వుండటం కథా చర్చల్లో చాలా ఉపయోగపడుతుంది. అలాగే కొంచెం గట్టిగా మాట్లాడాలని కూడా రవితేజ గారు చెబుతుంటారు.
దర్శకత్వం చేయాలని ఉందా ?
దర్శకత్వం చేయాలని వుంది. అదే అంతిమ లక్ష్యం కదా. కానీ అప్పుడే కాదు. రచయితగా చాలా కమిట్మెంట్స్ వున్నాయి. ప్రస్తుతం రచనపై ద్రుష్టి పెట్టాను
మీ కొత్త ప్రాజెక్ట్స్ ?
కళ్యాణ్ రామ్ గారి డెవిల్ విడుదలకు రెడీ అవుతుంది. టైగర్ నాగేశ్వర రావు కి మాటలు రాశాను. పుష్ప 2 కోసం వర్క్ చేస్తున్నా. ఇంకొన్ని సినిమాలు చర్చల్లో వున్నాయి.