రజాహుస్సేన్ కవిత – అరవైలో ఇరవై ఏమిటి ?

పచ్చి జ్ఞాపకం..!!

అరవైలో….
ఇరవై ఏమిటి ?

అమవాసలో…
వెలుగేమిటనేగా ?

నీ సంశయం !!

కాలం……..
రంగు వెలుస్తుంది
దేహం …….
ముడతలు పడుతుంది

అయినా…..

తలలు ….
బోడులవుతుంటే
తలపులు …..
చిగురిస్తుంటాయి..

నీకు తెలుసో ? తెలీదో ?

పాతబడే కొద్దీ…..
ద్రాక్ష రసానికి కిక్కెక్కువ ..

హృదయమూ అంతే..!!

*(చిత్రం..చిన్నారి ముమ్మిడి)

– ఎ.రజాహుస్సేన్, కవి

Rajahussain's poem - What is twenty out of sixty?
Comments (0)
Add Comment