పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి జగన్ మంచి పేరు తెచ్చుకోవాలి: రఘురామకృష్ణరాజు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిణామాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పిలుపుతో చాలా రాష్ట్రాలు పెట్రో పన్నులను తగ్గించాయని అన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రో ధరలు ఎక్కువ అని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి జగన్ మంచి పేరు తెచ్చుకోవాలని రఘురామ సూచించారు.

అటు, మద్యం ఆదాయం పక్కదారి పడుతోందని, మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఎక్కువగా అప్పులు తెచ్చే పాలకులను ప్రజలు హర్షించరు అంటూ విమర్శించారు.
Tags: Raghu Rama Krishna Raju, CM Jagan, Petro Prices, Andhra Pradesh

Comments (0)
Add Comment