అక్టోబర్ 23న రేడియో అక్కయ్య వర్ధంతి
న్యాయపతి కామేశ్వరి రాఘవరావుల గురించి ఈ తరం వారికి తెలియక పోవచ్చు. రేడియో ప్రసార సాధనంగా తెలుగు ప్రజల నిత్య జీవితాలతో పెనవేసుకు పోయింది. రేడియో. ఆ రేడియో ‘అక్కయ్య, అన్నయ్య’లుగా ప్రసిద్ధులయ్యారు. ఆంధ్ర బాలానంద సంఘం పేరుతో 1939-40 నుండి 1955-56 వరకు మద్రాసు, హైదరాబాదు నుండి తెలుగులో బాలల సాహిత్యానికి కృషి చేశారు. అక్కయ్య బాణీలు కట్టిన కొన్ని పాటలు ఎం.వి సంస్థ రికార్డులుగా వెలువడ్డాయి.
న్యాయపతి కామేశ్వరి (1908 – 1980) విజయ నగరంలోని 1908లో విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. విశాఖపట్నం లోని క్వీన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు. విజయనగరం మహారాజా కళాశాలలో డిగ్రీ 1932లో పూర్తిచేశారు. ఆ కాలంలో బి.ఎ. ఉత్తీర్ణులైన మొట్టమొదటి మహిళ ఆమె. నూజివీడు ఎస్టేటులో కపిలేశ్వరపురం జమిందారిణి జగదీశ్వరమ్మలు ఆమెకు ఇంగ్లీషు నేర్పారు. 1934లో న్యాయపతి రాఘవరావును వివాహం చేసుకున్నారు. 1937లో మద్రాసులోని వెల్లింగ్టన్ టీచర్ ట్రైనింగ్ కాలేజీ లో ఉపాధ్యాయ శిక్షణ (ఎల్.టి.) పూర్తిచేశారు. ఇద్దరి అభిప్రాయాలు కలియడంతో భర్తకు తోడుగా చెన్నై రేడియో కార్యక్రమాలలోను, బాల పత్రిక నిర్వహణలోను ఆమె చురుగ్గా పాల్గొన్నారు. Radio Akkayya Vardhanthi
చెన్నై ఆకాశవాణి కేద్రం వారు చేపట్టిన ఆట విడుపు కార్యక్రమం భాద్యత న్యాయపతి దంపతులకు ఇచ్చారు. ఆమె రేడియో అక్కయ్యగా స్తిరపడి పోయారు. రాఘవరావు రేడియో కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అతనికి రేడియో అన్నయ్యగా పేరొచ్చింది. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో వారిద్దరు పని చేసారు. కామేశ్వరి రేడియోకు అటు పత్రికలకు, రంగస్థలానికి అనేక నాటికలు, కథలు, గేయాలు రాసేవారు. బాలలను నటులుగా, కళాకారులుగా తీర్చిదిద్దారు. పల్లె ప్రాంతాలలో రేడియో మహిళా మండలాలు ఏర్పాటు చేశారు. ఆనాటి కేంద్ర ప్రసారశాఖ మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రశంసలను అందుకున్నారు. బొమ్మల కొలువులు ఉత్సవాలు విహార యాత్రలు నిర్వహించేవారు. సామాజిక స్పృహ కలిగించేవిగా ఆమె రచనలుండేవి. కథలు బాలలకు సులభంగా అర్థమై పోతాయి. ఆమె రాసిన కథల్లో ” అనగనగా ఆకలి కథ, ఇల్లు ఇరకాటం, ఆ చంద్రం, దోమ కోతి, తాత అవ్వ కథ, అమ్మమ్మ బహుమానం, కోతి చేష్టలు నాలుగు ఏనుగుల కథలు ముఖ్యమైనవి. Radio Akkayya Vardhanthi
కామేశ్వరి వ్రాసే నాటికలలో ఉన్న పాత్రలు అన్నీ ఆడపిల్లల పాత్రలే ! పిల్లలను చేరదీసి మంచి అలవాట్లు ఏవో, చెడు అలవాట్లు ఏవో కామేశ్వరి విడమరిచి చెప్పేవారు. ఆంధ్ర బాలానంద సంఘం కోసం తన సొంత భవనాన్ని దారాదత్తం చేశారు. కామేశ్వరి ఆశయాల మేరకు మర్రి చెన్నారెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జవహర్ బాల భవన్ ఏర్పాటు చేశారు. మండలి వెంకట కృష్ణారావు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కామేశ్వరరావు కోరిక మేరకు ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ స్థాపన జరిగింది. 1975లో తొలి అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరిగిన సందర్భంగా బాల సాహిత్యానికి చేసిన సేవలకు ఆమెను ఘనంగా సత్కరించారు. 1978లో “బాలబంధు” బిరుదుతో ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ వారు సత్కరించారు. 1981లో కామేశ్వరి రచనలను అన్నింటినీ కలిపి “ భోగి పళ్ళు ” అనే సంకలనంగా తెచ్చారు. బాలానంద మహోద్యమానికి భర్త న్యాయపతి రాఘవరావుకు సర్వ విధాలా సహకరించిన కామేశ్వరి తన 72వ ఏట 1980 అక్టోబర్ 23వ తేదీన ఈ లోకం వదిలి వెళ్లారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494