ప్రజాసక్షేమమే వైసిపి ప్రభుత్వ లక్ష్యం ౼వైసిపి సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి

అనంతపురం : మే30 :

ప్రజా సంక్షేమమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని వైసిపి సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి గారు పేర్కొన్నారు.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసిపి సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి గారు పాల్గొన్నారు.పార్టీ శ్రేణులతో కసిలి ఆయన వైయస్సార్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అనంత చంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందిస్తున్నారని తెలిపారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారి సారధ్యంలో జిల్లా కేంద్రం అభివృద్ధి బాటలో సాగుతోంది స్పష్టం చేశారు.ప్రజల సహకారంతో నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి ముఖ్య నాయకులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment