డివిజన్ పర్యటనలో సమస్యలు పరిష్కరిస్తాం- మేయర్ మహమ్మద్ వసీం సలీం

AP 39TV 03ఏప్రిల్ 2021:

డివిజన్ పర్యటనలో నా దృష్టికి తీసుకువస్తున్న సమస్యలు పరిష్కరిస్తామని మేయర్ మహమ్మద్ వసీం సలీం పేర్కొన్నారు. శనివారం నగర పరిదిలోని 30,32 డివిజన్ల లలో మేయర్ మహమ్మద్ వసీం పర్యటించారు. ఆయా డివిజన్ల పరిధిలోని సెవన్ హిల్స్ కాలనీ, విద్యుత్ నగర్ సర్కిల్, జీసన్ నగర్ ప్రాంతాల్లో మేయర్ మహమ్మద్ వసీం పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు, స్పీడ్ బ్రేకర్ లు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని,రోడ్లపై గుంతలు పూడ్చాలని వంటి అనేక సమస్యలను స్థానికులు మేయర్ మహమ్మద్ వసీం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన సమస్యలు తెలుసుకునేందుకే డివిజన్ల పర్యటన చేస్తున్నామని మీరు తీసుకువచ్చిన సమస్యలు త్వరితగతిన పరిష్కారిస్తామని భరోసా కల్పించారు. మేయర్ వెంట కార్పొరేటర్ లు కమల్ భూషణ్, నరసింహులు,సైఫుల్గా భేగ్, అనిల్ కుమార్ రెడ్డి మరియు అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలుతో పాటు నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

Comments (0)
Add Comment