ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేయించిన- ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కోటేష్

AP 39TV 02ఏప్రిల్ 2021:

రాయదుర్గం తాలూకా నగరంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల సెయింట్ పాల్, ఏ వి ఆర్ స్కూల్ ,సెయింట్ థామస్ స్కూల్, తరగతులు నిర్వహిస్తూ పరీక్షలు పెడుతూ పాఠశాలలను నడుపుతున్న విషయం తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కోటేష్ స్కూలు బందు చేయించి విద్యార్థులను బయటకు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే రోజు సెలవు దినంగా తరగతులు నిర్వహించకూడదని మన అనంతపురం డి ఈ ఓ శ్యాముల్  చెప్పినా కూడా తరగతులు నిర్వహిస్తున్నారు అదేవిధంగా మన రాయదుర్గం మండలానికి విద్యాశాఖ విద్యాశాఖాధికారి నాగమణి మేడం కి తెలియజేసిన ప్రైవేట్ స్కూల్ కి సపోర్ట్ గా మాట్లాడడం జరిగింది. మేడం  ప్రైవేట్ పాఠశాలలకు సపోర్ట్ చేసి తరగతులు పెట్టుకుంటే పెట్టుకోండి అనడం మంచిది అయితే ప్రభుత్వ పాఠశాలలు కూడా పెట్టుకోండి అని చెప్పండి అది కరెక్ట్ మేడం అంతే కానీ ప్రైవేట్ పాఠశాలలకు ఒకరకంగా ప్రభుత్వ పాఠశాలలకు ఒకరకంగా మాట్లాడటం మీకు ఉన్నటువంటి స్థాయికి అవహేళన చేసినట్టే అని ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తున్నాము. సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యాన్ని మీరు తరగతుల పరీక్షలు నిర్వహించడానికి ఎవరైనా పర్మిషన్ ఇచ్చారు అని అడిగితే అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం విద్యార్థి నాయకుల పై అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది .విద్యార్థి నాయకుల వి ఫోన్లు తీసుకొని వీడియోలు ఫోటోలు తీయ వద్దు అని ఎవరి కి చెప్పుకుంటారొ చెప్పుకోండి మీరు చేతనైంది చేసుకోండి అంటూ మేమేం చేయాలో చేస్తామని సెయింట్ పాల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థి నాయకుల పై మాట్లాడడం జరిగింది. మరి వెంటనే కూడా ఉన్నతాధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలల పై చర్యలు తీసుకోని తగ్గిన జరిమాన విధించాలీ అన్ని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం అని కోట్రేష్ తెలియజేశారు .

 

R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.

Comments (0)
Add Comment