కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సూచనలు – సత్య ఏసుబాబు IPS

AP 39TV 15 ఏప్రిల్ 2021:

అనంతపురం నగరంలోని హోల్ సేల్ & రిటేల్ , పూల మండీలు, కూరగాయల వ్యాపారులతో జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS  ఈరోజు స్థానిక పోలీసు కన్వెన్సన్ సెంటర్ లో ప్రత్యేక సమావేశమై కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.అనంతపురం నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తం కావాల్సి ఉంది. ముందస్తు జాగ్రత్తలు పాటించకపోతే కరోనా మరింత విజృంభించే అవకాశం ఉంది. వ్యాపార సముదాయాలు, దుకాణాలు, కూరగాయల మార్కెట్ వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు/నిబంధనలు పక్కాగా పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.అందరూ తప్పనిసరిగా మాస్కులు, హ్యాండ్ గ్లవుజులు, హ్యాండ్ శానిటైజర్ వాడాలి. సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి.
* ప్రతీ వ్యాపార సముదాయం, దుకాణాల వద్ద మాస్క్ ధరింపు, తదితర జాగ్రత్తలపై బోర్డులు పెట్టుకోవాలి.ఎలాంటి అపోహలు లేకుండా 45 సం., దాటిన వారు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ కార్యక్రమంలో అనంతపురం నగర పాలక సంస్థ కమీషనర్ ముర్తి, అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరెడ్డి, నగర సి.ఐ లు ప్రతాపరెడ్డి, జాకీర్ హుస్సేన్ , రెడ్డెప్ప, కత్తి శ్రీనివాసులు, ఎస్సైలు చాంద్ బాషా, విజయభాస్కర్ , తదితరులు పాల్గొన్నారు.

 

 

Comments (0)
Add Comment