Police’s letter to Srikanthachari శ్రీకాంతచారికి పోలీస్ అన్నయ్య లేఖ

Police elder brother’s letter to Srikanthachari

శ్రీకాంతచారికి పోలీస్ అన్నయ్య లేఖ

అతని జాబ్ పోలీసు అధికారి.. ప్రవృత్తి రచనలు.. పోలీసు సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తునే కథలు.. కవితలు.. వ్యాసాలు రాస్తూ సమాజాన్ని జాగృత్తి చేస్తుంటాడు అతని పేరే రాజేష్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని( శ్రీకాంతచారి వర్దంతి నేడు 3-12-2009 ) ప్రాణాలర్పించిన శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా ప్రియమైన తమ్ముడు అంటూ రాసిన లేఖ ఇదే..

ప్రియమైన తమ్ముడు శ్రీకాంతచారికి,

నీ పవిత్రమైన అమరత్వానికి రమణీయమైన రాజకీయ రంగుబూసి , విలక్షణమైన విధ్వంస రచనతో , విరగబూసిన అవినీతి కట్టడాలతో , వికృత ప్రణాళిక రచనలతో,నిరంకుశ, వితండవాదనతో”అన్నీ నేనేననే సినిమాతో నడుస్తుంది తమ్మి నువ్వులేని… నేటి తెలంగాణ !

నీలాంటి పన్నెండు వందలకు పైగా ప్రాణ త్యాగాలపై భోగాల యోగాలనుభవిస్తున్నారు తమ్మి. నువ్వున్న దగ్గరినుండి ఇక్కడి అరాచకాలు చూడు తమ్మి . మూడున్నర కోట్ల మందిలో, చదువుకున్న వాళ్ళలో, ప్రతీకుటుంబం నుండి ముసలం పుట్టించే శక్తి ఒకటి నీ మారు రూపంలో పుడితేనే సాధ్యం తమ్మి . మోసకారుల , కుహనా నాయకుల కుటుంబాలు లాతూర్ లో భూకంపమొచ్చినట్లు వీళ్ళు శిథిలమై పోవాలని అక్కన్నుండి నిజంగా అనుకొని శపించు తమ్మి !! Police’s letter to Srikanthachar

వందలాది తల్లుల గర్భశోకం వాళ్ళకు అనుభవమవ్వాలని ఒక్కసారి గట్టిగా అనుకో తమ్మి . వాళ్ల అంతస్తులపై , బూర్జు ఖలీఫాల రంకు పరుపులపై , రాజభోగాల అవినీతి రాజభవంతులపై , మోసకారితనపు మెదళ్ళపై, వేలాది ఎకరాల భూములల్లో పళ్ళేరులు , పరికికంపలు , జిల్లేడు పొదలు , తుమ్మలు మొలిచి మళ్ళీ మొదటికి రావాలని గట్టిగా అనుకో తమ్మి !!

***
దయచేసి ఒక్కసారి వచ్చిపో తమ్మి నీ అన్నను గదా అడుగుతున్న తమ్మి . అక్కడ పనేముంది తమ్మి ? ఉన్న పన్నెండువందలకు పైగా నీలా
అమృతం తాగినా వాళ్ళేగదా ! మళ్ళీ మొదలువెట్టు తమ్మి , దగాపడిన వాళ్ళతో కలిసి అవినీతి దుర్గాన్ని శిథిలం చెయ్యడానికి చదువునేర్పిన ఉస్మానియా ఒడినుండే ఇక్కడ మళ్ళీ ముగ్గువోయడానికి మేస్త్రీలమై రడీగా ఉన్నాం తమ్మి . !!!
ఇక ముగిస్తా ! నీ రాకకై ఎదిరి చూస్త తమ్మి ! Police’s letter to Srikanthachari

ఇట్లు

నీ అన్న  రాజేశ్

Police's letter to Srikanthachari /telangana freedom / zindhagi.com/ zindagi.news /yatakarla mallesh / kcr / jai telangana
Comments (0)
Add Comment