Poison period (poem)
విషపు కాలం ( కవిత )
చీకటికి సిగ్గులేదని
చుక్కలు వెక్కివెక్కి
దుఃఖిస్తున్నాయి
బానిసత్వం
సుఖమైన బ్రతుకు
మోచేయి కార్చిన
కన్నీటితో దాహం
తీర్చుకుంటున్నది
కలికి గాంధారి వేళన
ఆకు అలికిడిని
తట్టి లేపింది
నడికూడలిలో
మూడంకేసిన
కుక్కొక్కటి మొరిగింది
గాలి ముండమోసి
ఎండలో కూర్చున్నట్టూ
ఊరు ఉలిక్కైనా పడలేదు
బడితే బట్టలు చించుకొని
రొమ్ము విరుచుకొని
నిలబడింది
మోకాలు బూతులు
కక్కుకున్నది
అయినా నిశ్శబ్దం
చలిమంటేసు కుంటున్నదంటే
కాడు మండని
మొండి కాలం
కవి లేని కాలం