Poetry beyond the seventh sky
ఏడో ఆకాశం ఆవల
ఎగిరి పోవే రామచిలకా
ఎగిరిపోవే ఎగిరెగిరి పోవే
ఎందాకని ఎగురుతావు
ఎక్కడికని వెళతావు?
ఏడు ఆకాశాలున్నాయటగా
ఎన్ని ఆకాశాలు దాటుతావు
పిక్కల బలం…
రెక్కల్లో వుండేదాకేగా…!!
ఎంత ఎగిరినా ఎగిరెగిరినా
ఏదో ఒక చోట అలిసి పోతావు
అలసి సొలసి మబ్బుల్లో
కరిగి పోతావు.. కలిసిపోతావు
నువ్వైనా ! నేనైనా!
ఇంతేకదా?
ఊపిరాగితే జీవితం
అంతేకదా?
మరి ఏడో ఆకాశం సంగతేంటి?
పై స్వర్గ నరకాల మర్మమేమిటి?
చెప్పరాదే నా రామ చిలకా!
ఈ చిక్కుముడిని విప్పరాదే
నా రామచిలకా!!
Poetry beyond the seventh sky