చైనాను వదలని కరోనా మహ్మరి ఆందోళనలో ప్రజలు

ఎవరు చేసుకున్న కర్మ వాడు అనుభవించాల్సిందే.

చైనా విషయంలో చాలా మందిలో ఇదే అభిప్రాయం..

కరోనాకు పుట్టిన దేశంగా పేరొందిన చైనాలో ఇంకా ప్రజలు అతలకుతలం అవుతున్నారు. మొన్నటి వరకు కరోనా మహ్మరి తగ్గు ముఖం పట్టిందనే వార్త కథనాలతో ప్రజలలో భయాందోళనలు తగ్గాయి.

అయితే.. మరోసారి ఒమిక్రాన్ పేరుతో ప్రపంచంపై దాడి చేయడానికి సిద్దంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌కు చెందిన 500 ఉపరకాలు వ్యాప్తిలో ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఇవి మరిన్ని వేవ్‌లకు దారితీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

చైనాలో పరిస్థితి ఆందోళనగా..

చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది.

కొంత కాలంగా వైరస్‌ వ్యాప్తికి కొవిడ్‌ ఆంక్షలు సడలింపుతో పాటు అనేక కారణాలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే ఒమిక్రాన్‌కు చెందిన 500 ఉపరకాలు వ్యాప్తిలో ఉన్నాయనే వాస్తవాన్ని మరవొద్దని..

రానున్న రోజుల్లో మరిన్ని వేవ్‌లు తప్పవని హెచ్చరించింది.

People are worried about the corona virus that has not left China / thewidenews.com / yatakarla mallesh
Comments (0)
Add Comment