కదిరి ఏరియా హాస్పిటల్ లో సరైన వైద్యం అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు-కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా

AP 39TV 04మే 2021:

కదిరి ఏరియా హాస్పిటల్ లో సరైన వైద్యం అందించక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా కరోనా విపత్కర పరిస్థితులలో సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని తెలియజేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల సరైన సదుపాయాలు లేక ప్రజలకు ఇబ్బంది కలుగ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా మండిపడ్డారు. కరోనా టెస్టింగ్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని డాక్టర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కదిరి ఏరియా ఆస్పత్రి చుట్టుపక్కల లక్ష జనాభా ఉన్న రోజుకు 50 చొప్పున టెస్టింగ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు మృత్యువాత పడ్డారు అన్నారు.

 

Comments (0)
Add Comment