Peasant movement in Delhi ఢిల్లీలో రైతుల ఉద్యమం
రైతు వ్యతిరేక బిల్లులపై ఉద్యమం
శరీరాలను మండించే ఎండలు.. ఎముకలు కొరికే చలి.. మనుషులను చంపే వడగళ్ళవానలు.. ప్రభుత్వ కుట్రలు.. హత్యా ప్రయత్నాలు.. హత్యలు.. దాడులు.. దుష్ప్రచారాలు.. 600మంది సహచరుల మరణం.. వీటన్నింటినీ భరిస్తూ ఎదిరిస్తూ 333 రోజులుగా రైతులు ఉద్యమిస్తున్నారు.
కేంద్రం తీసుకవచ్చిన మూడు ప్రజా వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ తో 11నెలల క్రితం 2020, నవంబర్ 26 నాడు పంజాబ్ నుండి వేలాది మంది Peasant movement in Delhi రైతులు పోలీసుల అడ్డంకులు దాటుకొని ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ కి చేరుకొని అక్కడే రోడ్డుపై బైటాయించారు. ఇక అక్కడి నుండి ఉద్యమం రోజురోజుకూ పుంజుకుంది. విస్తరించింది. ఢిల్లీ సరిహద్దుల్లో వేల మంది కాస్తా లక్షలకు చేరుకుంది. ప్రారంభంలో సింఘు, టిక్రీ ల్లో మాత్రమే బైటాయించిన రైతులు అనంతరం ఘాజీపూర్ లో కూడా రైతులు రోడ్లపై బైటాయించారు.
ముందుగా పంజాబ్ నుండి మొదలైన ఉద్యమం అనంతరం హర్యాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్, మహారాష్ట్రలకు కూడా విస్తరించింది. దక్షిణభారతం నుండి కూడా వేల మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్నPeasant movement in Delhi రైతుల నిరసనల్లో పాలుపంచుకున్నారు. ఉద్యమం ఊపందుకున్నాకొద్దీ కేంద్రప్రభుత్వ కుట్రలు కూడా పెరిగాయి. ఉద్యమాన్ని అణిచివేయడానికి హింసని ప్రయోగించింది. పోలీసులే కాక బీజేపీ కార్యకర్తలు కూడా రైతులపై దాడులకు తెగబడ్డారు. మరో వైపు ఉద్యమంపై దుష్ప్రచారానికి తెరతీసింది. అయినప్పటికీ రైతుల ఐక్యతను బద్దలు చేయలేకపోయింది ప్రభుత్వం.
నిరసనను విచ్ఛిన్నం చేయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి, అయితే రైతులు అప్రమత్తంగా ఉన్నారు.ప్రభుత్వ కుట్రలను ప్రతిఘటిస్తున్నారు. సింఘూ సరిహద్దులో నిహాంగ్ సిక్కులు ఒక వ్యక్తిని కొట్టి చంపడం, అనేక వ్యవసాయ సంస్థలు చట్టాలకు అనుకూలంగా ఉన్నాయని, పోరాటాలు త్వరలోనే ముగిసి పోతాయని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించడం, కేంద్ర మంత్రులు రైతు అగ్ర నాయకులతో టచ్ లో ఉన్నారని త్వరలోనే పోరాటం ముగిసిపోతుందని తాజాగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ పేర్కొనడం, ఇవన్నీ రైతుల ఐక్యతను దెబ్బకొట్టడానికి వేసే ఎత్తుగడలుʹʹ అని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) నాయకుడు దర్శన్ పాల్ అన్నారు.
ఈ Peasant movement in Delhi ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి భవిష్యత్తులో మరిన్ని ప్రయత్నాలు జరుగుతాయని రైతులు భావిస్తున్నారు. రైతులపై భౌతిక దాడులు చేయడాని 1,000 మందిని రెడీ చేయాలని హర్యానాలోని బిజెపి ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే బీజేపీ కార్యకర్తలను ఆదేశించారని రైతు సంఘాలు ఆరోపించాయి. BKU (ఏక్తా దకుండా) ప్రధాన కార్యదర్శి జగ్‌మోహన్ సింగ్ మాట్లాడుతూ, గత 11 నెలల్లో, మండి వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలను చేస్తోందన్నారు. ప్రభుత్వ మద్దతు ధర లేకుండానే తమ దాన్యాన్ని, ఇతర సరుకులను అమ్మాలని రైతులపై తీవ్ర వత్తిడి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం. ʹకార్పొరేట్‌లకు లబ్ది చేకూర్చే ఈ బహిరంగ దోపిడీ నుండి రైతులను రక్షించాలంటే ప్రతి రైతుకు ప్రతి వస్తువుకు కనీస మద్దతు ధర (MSP) ఇవ్వాల్సిందే. ఈ డిమాండ్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ నుండి విడదీయరానిది, ʹ అన్నారాయన.
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియా గ్రామంలో నలుగురు రైతులను బీజేపీ నాయకులు చంపడం, బిజెపి నాయకులను వ్యతిరేకిస్తూ, పోరాట సంకల్పాన్ని మరింత దృఢపరిచిందని రైతు ఉద్యమంలో అగ్రగామిగా ఉన్న BKU (ఏక్తా ఉగ్రహన్) అధ్యక్షుడు జోగీందర్ సింగ్ ఉగ్రహన్ అన్నారు. ʹʹచివరి వరకు ఎలాంటి వెనకడుగు లేకుండా పోరాడుతూనే ఉంటాం. రైతుల పోరాటం సాధారణ నిరసన కాదు, శక్తివంతమైన ప్రభుత్వాలను ఎదుర్కోవడానికి సంకల్పం ఎంత అవసరమో ప్రపంచానికి చూపించిన మార్గనిర్దేశం, ʹఅని ఉగ్రహన్ అన్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా (SKM) 11 నెలల ఆందోళనకు గుర్తుగా మంగళవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు హర్యానాలోని బంగర్ బెల్ట్‌కు చెందిన రైతులు జింద్ మరియు కైతాల్ జిల్లాల్లోని వివిధ సబ్‌డివిజన్‌లలోని కీలక కార్యాలయాలను ముట్టడించారు. 11నెలలుగా అప్రతిహతంగా సాగుతున్న ఈ దేశ రైతాంగ ఉద్యమాన్ని ఎలాగైనా అణిచివేసి తాము ఎలాంటి రాజీ లేకుండా కార్పోరేట్ సంస్థలవైపు మాత్రమే ఉన్నామని నిరూపించుకునేందుకు పాలకులు ప్రయత్నిస్తూ ఉండగా, 600 సహచరుల ప్రాణాలు కోల్పోయి, కష్టాల బాటలో సాగుతున్న రైతాంగపోరాటం విజయవంతం కావాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
ఎం.వి. రమణ జర్నలిస్ట్
Avaninews.com సౌజన్యంతో..