Patwari in public service ప్రజా సేవలో పట్వారి తులసి కుమార్

Patwari Tulsi Kumar in public service

ప్రజా సేవలో పట్వారి తులసి కుమార్
నేటి యువతకు ఆదర్శం..

ప్రజలకు సేవా చేయాలంటే పదవులే అవసరం లేదని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. నిస్వార్థంగా సేవాలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు అతను.. అతని పేరు తులసి కుమార్. నివాసం ఆర్మూర్. అయినా.. సోషల్ వర్కర్ తులసి కుమార్ అంటెనే ఆర్మూర్ ప్రాంత ప్రజలకు తెలుసు. వివేకానందుని స్పూర్తిగా ప్రజలకు సేవాలందిస్తున్న తులసి కుమార్ ను ‘‘జిందగీ’’ పలుకరించింది.

ప్రజా సైన్స్ వేదిక ద్వారా

విద్యార్థులకు సైన్స్ పై అవగహన కల్పించాలనుకున్నాడు తులసి కుమార్. ప్రజా సైన్స్ వేదిక జిల్లా కార్యదర్శిగా ఆర్మూర్ ప్రాంతంలోని స్కూల్ లలో ప్రత్యేకంగా సైన్స్ ప్రోగ్రాంలు నిర్వహించారు. సోషల్ మీడియాకు అడాక్ట్ అవుతున్న నేటి కాలంలో యువత లక్ష్యంతో ముందుకు వెళ్లితే ఏదైనా సాధించవచ్చని బోధిస్తుంటారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, సేవా బావంపై ప్రత్యేకంగా విద్యార్థులకు క్లాస్ లు ఇస్తున్నారు తులసి కుమార్.

తండ్రి స్పూర్తిగా..

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంకు చెందిన పట్వారి బ్రహ్మానందం -బాలసరస్వతి దంపతులకు 18 నవంబర్ 1986లో తులసి కుమార్ జన్మించారు. ఎమ్మెస్సీ, బిఇడి వరకు చదివిన అతను బ్రిలియంట్ స్టూడెంట్. చదువు తన కోసం కాకుండా ఇతరులకు ఉపయోగపడాలని భావించాడు అతను. తండ్రి బ్రహానందం విలేజ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా పని చేస్తూ ప్రజలకు సేవాలందించడాన్ని స్పూర్తిగా తీసుకున్నాడు తులసి కుమార్. Patwari in public service

మూఢనమ్మకాలు..

కలియుగం నుంచి కంప్యూటర్ యుగంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అయినా.. మూఢనమ్మకాలు ఇంకా వర్ధిల్లుతున్నాయని భావించాడు తులసి కుమార్. జన విజ్ఞాన వేధిక ఆర్మూర్ మండల అధ్యక్షునిగా ప్రజలకు మూఢ నమ్మకాలపై అవగహన కల్పించే ప్రోగ్రాంలు ఏర్పాటు చేశాడు. విద్యార్థులకు సైన్స్ పై అవగహన కల్పించడానికి పోటీ పరీక్షలు నిర్వహించాడు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు తులసి కుమార్ అంద చేసారు. కొంత కాలానికి ప్రజా సైన్స్ వేధిక జిల్లా కార్యదర్శిగా మూఢ నమ్మకాలపై అవగహన ప్రోగ్రాంలను జిల్లా స్థాయికి విస్తరింప చేశారు.

వ్యాస రచన, ఉపన్యాస పోటీలు..

యువతకు స్పూర్థిగా నిలిసిన వివేకానందుడి జయంతి ఉత్సవాలను పట్వారి తులసి కుమార్ నిర్వహించేవారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివేకానందుడిపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అంద చేస్తారు. జాతీయ నాయకులు మహత్మగాంధీ, సుభాష్ చంద్రబోష్, వివేకానందుడి మహానీయులు లాంటి వారి జీవితాల పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు.

విద్యార్థులకు భరోసా

విద్యతోనే జీవితాలు మారుతాయని భావించే పట్వారి తులసీ కుమార్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆర్థికంగా బాధ పడే పేద విద్యార్థులకు నోటు పుస్తకాలను, పరీక్ష ప్యాడ్లను, జామెట్రికల్ బాక్సులను, పెన్నులను అంద చేస్తారు. వేసవి కాలంలో చలివేంద్రం, కరోనా కాలంలో పట్వారి తులసీ కుమార్ సేవాలకు గుర్తుగా పలు అవార్డులు అందుకున్నారు. Patwari in public service

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
949 222 5111

Patwari Tulsi Kumar in public service /zindhagi.com / Patwari Tulsi Kumar/ yatakarla mallesh
Comments (0)
Add Comment