అసెంబ్లీ ఎన్నికలలో 50 సీట్లలో పోటీ చేస్తాం ఒవైసీ 

అసెంబ్లీ సాక్షిగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ

వర్సెస్ మంత్రి కేటీఆర్‌ ల పొలిటికల్ వార్

అసెంబ్లీ ఎన్నికలలో 50 సీట్లలో పోటీ చేస్తాం ఒవైసీ  ప్రకటన

అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ కు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కి మధ్య ఘాటు ఘాటుగా విమర్శల పర్వం నడుస్తోంది. తాజాగా మంత్రి కేటీఆర్‌కు అక్బరుద్దీన్‌ ఒవైసీ కౌంటర్‌ ఇచ్చారు. MIMకు ఉన్నది ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనన్న కేటీఆర్ వాఖ్యలపై అక్బరుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటామన్నారు.

వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.అసలు అక్బరుద్దీన్ సభలో ఏమన్నారంటే.. హామీలు ఇస్తారు.. అమలు హామీలు ఇస్తారు.. అమలు చేయరు. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవరు. మీరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాం. పాతబస్తీలో మెట్రోరైలు సంగతి ఏమిటి? ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితేంటి ? ఉర్దూ రెండో భాష అయినా అన్యాయమే.

బీఏసీ (BAC)లో ఇష్టారీతిలో నిర్ణయాలు తీసుకున్నారు. చర్చ సందర్భంగా సభా నాయకుడు కనిపించడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో కనిపించడం లేదు. టీవీ చర్చలకు వెళ్లే బీఆర్ఎస్ నేతల కు సభకు వచ్చే తీరిక లేదా?కేటీఆర్ కౌంటర్..మంత్రులు అందుబాటులో లేరన్నది అవాస్తవం. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీ ఎక్కువ టైమ్ అడగడం సరికాదు.

సభ్యులను బట్టి పార్టీలకు సమయం కేటాయిస్తాం. బీఏసీకి రాకుండా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆవేశంగా మాట్లాడటం కాదు.. అర్థవంతంగా సమాధానం ఇవ్వాలి. సభా నాయకుడితో ఒవైసీకి ఏం సంబంధం?అక్బరుద్దీన్ ఓవైసీ నేను కొత్త సభ్యున్ని కాదు.. చాలా సార్లు ఎమ్మెల్యే అయ్యా. టైంను ఎలా ఉపయోగించుకోవాలో మాకు తెలుసు.. రాజ్యంగబద్దంగా చర్చ జరగాలి. గతంలో చాలా సభల్లో గంటల సేపు చర్చించాం. ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు_

Owaisi will contest in 50 seats in the assembly elections
Comments (0)
Add Comment