Online Studies (Poetry) ఆన్ లైన్ చదువులు

అబాబీలు…

Online studies ..!!
ఆన్ లైన్ చదువులు..!!

తీగలేని పందిరిలా..
తీగ లేని ఆన్ లైన్ చదువులు
పిల్లల పెదవులపై చదువుల చిలకరింపు
హుస్సేనూ..
గురువు లేని చదువుల్లో గుండెక్కడా?

“బడి మొహం తెలీదు
బడి వాతావరణం తెలీదు
టీచర్ తెలీదు..టీచింగ్ తెలీదు
హుస్సేనూ..
నర్సరీకి కూడా ఆన్ లైన్ బాధేనా ?

ఆన్ లైన్ రొద పిల్లల కేమో గానీ…
పేరెంట్స్ కొచ్చి పడింది పెద్ద తంట
పిల్లలకే కాదు..పేరెంట్స్ కు కూడా పాఠాలు
హుస్సేనూ….
ఇంతకీ చదువులు పిల్లలకా? పెద్దలకా ?

వారానికి నాలుగు రోజులు
మహా అయితే..రోజుకో గంట ఆన్ లైన్ చదువు
ఫీజులు వడ్డింపు మాత్రం షరా మామూలే
హుస్సేనూ‌..
తీగ లేని చదువుకు మోయలేని ఫీజులా?

Online Studies (Poetry)

ఎ.రజాహుస్సేన్, కవి

Online Studies (Poetry) /zindhagi.com / zindhagi.news / abdul rajahussen / yatakarla mallesh
Comments (0)
Add Comment