Omicron Virus – Precautions
ఓమిక్రాన్ వైరస్ – ముందు జాగ్రత్తలు
ఓమిక్రాన్ వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే తమ వద్దకు రాదంటున్నారు. డాక్టర్ షణ్ముఖ ప్రజలకు ధైర్యాన్ని అందిస్తూ, అప్రమత్తత చేస్తూ రాసిన వ్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎవరికి డేంజర్?
భయపడే వార్తలను పదేపదే చదివే వారికి వినేవారికి డేంజర్. వారి భయమే వారి పాలిట శాపంగా మారుతుంది. ఓమిక్రాన్ చంపదు. భయం ముంచేస్తుంది. ముందుగా ఆల్ఫా వైరస్ వచ్చింది. అటుపై దాని కంటే అనేక రేట్ల వేగంతో విస్తరించే డెల్టా వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేగంతో ఓమిక్రాన్. కట్టడి చర్యల పేరుతో మీ భయాన్ని మార్కెటింగ్ చేసుకొనే ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి.
కరోనాతో సహా జీవనం చేయాల్సిందే..
కరోనాను నుంచి ముక్కున్న మానవుడు తప్పించుకోలేడు అని నేను ప్రారంభం నుంచి చెబుతున్నాను. కరోనా పోతుంది అని ఇంకా నమ్మే అమాయక ప్రజలు కోకొల్లలుగా వున్నారు. కరోనా ఎక్కడికీ పోదు. మరో వంద ఏళ్ళైనా ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో స్పానిష్ ఫ్లూ కలుగ చేసిన వైరస్ ఇంకా మనమధ్యే వుంది. అది సాధారణ జలుబు కలుగ చేస్తుంది . మొదటి ప్రపంచయుద్ధ కాలంలో అది ప్రాణాంతకం అయిన మాట వాస్తవం. కానీ మ్యుటేషన్లు జరిగే కొద్దీ బలహీనపడి జలుబు ఫ్లూ వైరస్ గా నిలిచిపోయింది. కరోనా కూడా అంతే. ఒళ్ళు నొప్పుల వైరస్ గానో మరో స్వల్ప లక్షణాలు కలుగచేసే వైరస్ గానో స్థిరపడి పోతుంది. మీ జీవిత కాలంలో ఎన్నో సార్లు సోకుతుంది . సోకినా ఏమీ కాదు . భయపడే వ్యక్తిని ఎవరూ రక్షించలేరు. Omicron Virus – Precautions
ఓమిక్రాన్ మరో రూపంలోకి..
ఓమిక్రాన్ కు మోనోక్లోనల్ యాంటీబోడీ కాక్టెయిల్ పనిచేసే అవకాశం తక్కువ. విపరీతంగా భయపడే వారు లేదా ఇమ్మ్యూనిటీ మరీ బలహీనంగా ఉన్న వారు తప్పించి మిగతా వారికి దీని అవసరం రాదు. మ్యుటేషన్లకు గురికావడం సూక్షజీవుల లక్షణం. {ఆ మాటకు వస్తే అన్ని జీవులు. కాకపోతే సూక్షజీవుల పై ప్రభావం ఎక్కువ}. ఓమిక్రాన్ రేపు మరో రూపంలోకి మారొచ్చు. దాన్ని ఆపలేము. దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు.
మన ఇమ్మ్యూనిటినే మనకు రక్ష
మన ఇమ్మ్యూనిటినే మనకు రక్ష. ప్రతిరోజు కనీసం అరగంట ఎండలో నడవండి. శరీరానికి డి-విటమిన్ అందివ్వండి . శాఖాహారులు బి12 విటమిన్ మాత్రలు తీసుకోండి. తినే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా {కనీసం ముప్పై శాతం} ఉండేలా చూసుకోండి. పన్నీర్, మొలికెత్తిన పెసలు, పుట్టగొడుగులు, బ్రోకలీ, జామ కాయ, చికెన్, ఫిష్ మటన్, గుడ్డు ప్రోటీన్ అందించే ఆహార పదార్తాలు. రోజుకు పెద్దలు నాలుగు లీటర్ల నీరు తాగాలి. చెమట పట్టే దాకా వ్యాయామం {కనీసం నడక} చెయ్యాలి బాడీ హీలింగ్ వ్యాయామం . శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వాలి. నిద్ర బాగా పోవాలి. ఇవన్నీ ఇమ్మ్యూనిటిని బలపరుచుకొనే మార్గాలు. Omicron Virus – Precautions
భయం పెద్ద విలన్..
అన్నింటికన్నా భయం పెద్ద విలన్. భయం ఇమ్మ్యూనిటిని చంపేస్తుంది. అదే ఫార్మసురుల అస్త్రం. భయంతో మళ్ళీ మీ ఆస్తులు ఖాళీచేసి వారి గోదాముల్లో నోట్లకట్టలు సంచుల్లో దాచుకొనే అవకాశాన్ని కల్పించుకుంటున్నారు తస్మాత్ జాగ్రత్త. వేవ్ అంటే ఆసుపత్రిల్లో బెడ్లు దొరకపోవడం, అంబులెన్సుల క్యూలు. ఇలాంటి స్థితి రాదు. కానీ మనదేశంలో కరోనా అంటే భయపడే వారు కోకొల్లలుగా వున్నారు. ఇన్నాళ్లయినా నిజాన్ని గ్రహించలేని వారు, భయం వద్దని చెబితే మొండిగా, మూర్ఖంగా వాదించేవారు వున్నారు. వారిని ఓమిక్రాన్ నుంచి ఎవరూ రక్షించలేరు. తత్త్వం బోధపడేటప్పటికీ వారు ఉండక పోవచ్చు. ఉన్నా ఆస్తులు పోగొట్టుకొని అనారోగ్యంతో. ఇలా చెబుతున్నందుకు క్షంమించండి. నిజం నిష్టూరంగా ఉంటుంది.
భయాన్ని బహిష్కరించండి..
నిర్భయంగా వుండండి. అప్రమత్తత అవసరం. అలసట అనిపిస్తే పల్స్ ఆక్సీమీటర్ లో ఆక్సిజన్ శాతం వారం రోజుల పాటు రోజుకు ఒకసారి చెక్ చేసుకోండి. అది 94 పైగా ఉంటే హ్యాపీగా కాలం గడపండి. ఇంకోసారి చెబుతున్నా కరోనాకు చంపే గుణం పోయింది. భయం చంపుతుంది. అది ఓమిక్రాన్ రూపంలో కాకపోతే గుండెపోటు రూపంలో అంతే. Omicron Virus – Precautions