ఏపీ 39టీవీ 07 ఫిబ్రవరి 2021:
అనంతపురం జిల్లా ఓ.డి.సి మండలం మహమ్మదాబాద్ చెక్ పోస్టును జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఎన్నికల దృష్ట్యా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెక్ పోస్టుల సిబ్బందికి సూచించారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీతో పాటు కదిరి డీఎస్పీ భవ్య కిశోర్ ,తదితరులు వెళ్లారు.