October 10 is World Mental Health Day
అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
ఒత్తిళ్లే మానసిక వైకల్యానికి మూలం..
మానసిక ఉద్రేకాల నిగ్రహం అవసరం
ప్రతీ ఏడాది అక్టోబర్ 10న ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ జరుపు కుంటున్నాం. నేటి ఔతాహిక యువ తరంలో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు వాటిని బయటకు చెప్పుకోలేక సత మవుతూ ఉంటారు. సమాజం వాటిని మరొక కోణం లోనే చూస్తున్న. ఈ నేపథ్యంలో మానసిక అనారోగ్య సమస్యను సాధారణ అనారోగ్యంగా భావించాలని తెలి పేందుకే ఈ రోజు నిర్వహిస్తున్నారు. 1992లో వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మనిషి పుట్టాక ఎలాంటి వైకల్యం లేకుండా ఉంటే అతడి జీవితం హ్యాపీగా సాగుతుంది. ఐతే చిన్న వైకల్యం ఉన్నా అది జీవితాంతం అతడిని పీడిస్తుంది. ఐతే కొందరు పుట్టుకతో ఆరోగ్యకరంగా బాగానే ఉన్నప్పటికీ హఠాత్తుగా మానిసిక రోగులుగా మారి పోతుంటారు. నిజానికి మనలో 40 శాతం పిచ్చి వాళ్ళేననేది నిపుణుల అంచనా అది మెడికల్ అనాలిసిస్ మాత్రమే. ఇంకా ఫ్రాంకుగా, నిఖార్సుగా చెప్పాలంటే పూర్తి నార్మల్ గా వుండేవాళ్లు బహుశా ఏ రెండు శాతమో వుంటారు.
మనచుట్టూ ఎంత అబ్ నార్మాలిటీ?! ఎన్ని వింత పోకడలు? తిండి పిచ్చి, డబ్బు పిచ్చి, నగల పిచ్చి, పుస్తకాల పిచ్చి పేరుపిచ్చి, సినిమాల పిచ్చి.. గొప్పలు చెప్పడం, అప్పులు చేయడం ఆడంబరాలు పోవడం, షాపింగు, అతి వాగుడు, మితిమీరిన కోపం… వైద్య పరి భాషలో డిప్రెషన్, యాంగ్జయిటీ, యాంగ్జయిటీ న్యూరోసిస్, బైపోలార్ డిజార్డర్, సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఫోబియా, మానియా స్కిజోఫ్రీనియా, డిల్యూషనల్ డిజార్డర్, స్లీప్ డిజార్డర్ ఇోమ్నియా), ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇల్యూషన్, అడిక్షన్ లాంటి మానసిక వైకల్యాలు అనేకం ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే మానసిక ఉద్రేకాలను నిగ్రహించు కోలేకపోవడమే రుగ్మతను తెచ్చి పెడ్తుంది.
ఏ లక్షణమైనా సరే అవధులు దాటినప్పుడు అది పిచ్చి చేష్ట అవుతుంది. హద్దుల్లో మనం వుండి, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నంత వరకు ఎవరూ మనని తప్పుపట్టారు. మానసిక వైకల్యం వచ్చిన వారిలో సగానికి పైగా 14 ఏళ్ల లోపు వయసు నుంచి ఈ సమస్య ప్రారంభ మవుతుంది. మొత్తం 20 శాతం మంది బాల బాలికల్లో ఈ అవలక్షణం ఉన్నట్లు తేలింది. భయంకర సంఘటనలు, సామాజిక పరిస్థితుల కారణంగా మానసిక వైకల్యం చెందడం సర్వ సాధారణమైన కారణంగా చెపుతారు. మానసిక సమస్యతో బాధపడే వారిని గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వెంటాడుతాయి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు పూర్తిగా ఆ సమస్యలో కూరుకుపోవడానికి కారణం సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా కారణమవుతున్నారు.
సమాజంలో మానసిక అనారోగ్యంతో బాధ ప
టుంది. 2).అమ్నోసియా… ఇది కూడా సర్వసాధారణంగా కనబడేదే. వీరిలో కనిపించే లక్షణం మర్చిపోవడం. బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా చెప్పినవి, జరిగినవి మర్చి పోతుంటారు. 3).ఆస్పర్జెర్స్ సిండ్రోమ్…. వీరిని కూపస్త మండూకాలని చెప్పవచ్చు. సమాజంలో ఎవ్వరితోనూ వీరికి సంబంధాలు ఉండవు. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడరు. ప్రత్యేకమైన వ్యక్తులుగా అగుపిస్తుంటారు. 4).మహా ఒత్తిడి… ఈ ఒత్తిడి అనేది చాలా పెద్దపదం. దీని కారణంగా చాలామంది ప్రాణాలు తీసుకున్న సంఘటనలున్నాయి. ఈ ఒత్తిడి సమస్య కారణంగా వారిపై వారికి నమ్మకం సన్నగిల్లుతుంది. సంతోష కరమైన పండుగలు ఇతరత్రా ఏవి వచ్చినా వాటిని జరుపు కునేందుకు ఆసక్తి చూపరు. ప్రతిదాన్ని విమర్శిస్తూ తిట్టుకుంటూ ఉంటారు. నలుగురితో కలిసి తిరగడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఇలాంటి వారి మానసిక స్థితిని మామూలు స్థితికి తీసుకు రాకపోతే ఆత్మ హత్యలకు పాల్పడేందుకు అవకాశం ఉంటుంది. 5).ఓసీడీ… ఒబెసివ్ కంపల్సివ్ డిజార్డర్… అంటే వీరు ఒకరకంగా మతిమరుపు టైపే. పెట్టిన చోట వస్తువు ఉందో లేదో అని పదేపదే చెక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి చిన్నదానికి చేతులు కడుక్కోవడం, ఇంట్లో ఉన్న వస్తువులను లెక్కబెట్టడం, అకస్మాత్తుగా స్నానం చేయడం, తలుపులు వేసి ఉన్నాయో లేదో అని పలుమార్లు చెక్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అలాగే వదిలేస్తే ఇవి కూడా ఆ వ్యక్తిలో ఆత్మహత్యల వైపు తీసుకెళతాయి.
కాబట్టి మానసిక వైకల్యం ఉన్న వారి విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకో వలసిన అవసరం ఉంటుంది.
వృద్దాప్యం మరో బాల్యం లాంటిది. పండుటాకులకూ పసిబిడ్డలకూ పెద్దగా తేడా ఉండదు. వృద్ధులతో వ్యవహరించేటప్పుడు కాస్త సున్నితంగా ఉండటం చాలా అవసరం. సగటు ఆయుర్దాయుం పెరగడంతో వృద్ధుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. వృద్ధుల సంఖ్యతోపాటే మలి వయసులో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్యా పెరుగుతోంది. మానసిక చికిత్సా విభాగానికి వచ్చే ప్రతి వంద మందిలో 25 మంది వృద్ధులుంటున్నారు. వీరిలో అత్యధికులు డిప్రెషన్, నిద్రలేమి ఆందోళన, డిమెన్షియా వంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
మానసిక రుగ్మతలు ఉన్నవారికి మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి తీసుకువస్తే వ్యాధిని పూర్తిగా నియంత్రించ వచ్చు. అలాంటి వ్యాధి సోకితే జబ్బు తీవ్రత కంటే ఎక్కువగా మనం తల్లడిల్లిపోతాం. మనతో బాటు మనవాళ్ళూ ఆందోళన చెందుతారు. నాడీ సంబంధిత ప్రసరణ వ్వవస్ధ (న్యూరో ట్రాన్స్ మిట్టర్స్)…మానసిక రుగ్మతలు మెదడులోని న్యూరో ట్రాన్స్ మిట్టర్స్ అని పిలువ బడే ప్రత్యేక రసాయనాలలో కలిగే అసాధారణమైన సమతుల్యానికి సంబంధం కలిగి ఉంటాయి.
మెదడులో ఉండే నాడీ కణాలు ఒకదానితో మరొకటి సంబంధాన్ని నెరపుతూ ఉండడానికి సహకరించు కుంటాయి. ఒకవేళ ఈ రసాయనాలలో సమతౌల్యం లోపించినా లేక అవి సరిగా పనిచేస్తూ ఉండకపోయినా, మెదడులో సంకేతాలు ఒకచోట నుండి మరొకచోటకు సరిగా పంపబడుతూ ఉండవు, మానసిక అనారోగ్య లక్షణాలకు దారి తీస్తాయి. జన్యు శాస్త్రం… కుటుంబాలలో వస్తూ వుండే మానసిక రుగ్మతలు తమ కుటుంబంలో మరో ఏ సభ్యుడికైనా అటువంటివి ఉన్నట్లయితే, మిగతా వారు కూడా అటువంటి మానసిక రుగ్మతల బారిన పడే అవకాశాలను ఎక్కువగా కలిగి ఉంటారని సూచిస్తున్నాయి. మానసిక రుగ్మత, వైకల్యం అనేది అనేక జన్యువుల పరస్పరక్రియ, ప్రభావం (ఇంటరాక్షన్) వల్ల మరియు ఇతర అంశాల వల్ల – అంటే ఒత్తిడి, దుర్వినియోగం, లేకపోతే ఒక శరాఘాతం (ట్రోమా) కలిగించే సంఘటన వంటివాటి వల్ల సంభవిస్తుంది. ఒక వ్యక్తి వారసత్వంగా ఈ రుగ్మతకు గురయ్యే అవకాశాన్ని కలిగి వున్నప్పుడు ఆ వ్యక్తిలో ఇవి అనారోగ్యాన్ని మరింత ప్రభావితం చేయడమో లేక అనారోగ్యాన్ని ఉసిగొల్పడమో చేస్తాయి.
అంటు రోగాలు… మెదడు దెబ్బ తినడానికి మరియు మానసిక రుగ్మత వృధ్ది చెందడానికి లేక క్షీణించిపోతూ ఉండే పరిస్ధితిని తెలియజేసే రోగ లక్షణాలతో సంబంధం కలిగి వుంటాయి. ఉదాహరణకు పీడియాట్రిక్ ఆటో ఇమ్యూన్ న్యూరో సైకియాట్రిక్ డిజార్డర్ (పి.ఏ.ఎన్.డి.ఏ) గా పిలువబడే పరిస్ధితి పిల్లలలో స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా అనేది అబ్సెస్సివ్-కంపల్సివ్ డిజార్డర్ (నిరంతరం ఒకే భావంతో ఉండే స్ధితి-తప్పనిసరి, బలవంత మైన వైకల్యం) మరియు ఇతర మానసిక రుగ్మతలు పెరగడంతో సంబంధం కలిగి ఉంటుంది. మెదడులో లోపాలు లేక గాయం…మెదడులో లేక మెదడు లోని కొన్ని భాగాలలో లోపాలు కలుగడం లేక గాయాలు కలిగి వుండడం అన్నది కొన్ని మానసిక రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది.
రామ కిష్టయ్య సంగన భట్ల
రచయిత సెల్: 9440595494