పొట్టి శ్రీరాములు పాఠశాలలో మేయర్ మహమ్మద్ వసీం పరిశీలన

AP 39TV 17ఏప్రిల్ 2021:

ప్రభుత్వ పాఠశాల అంటే ఉపాద్యాయులు సరిగా పాఠాలు చెప్పరు అనే భావన అనేకమంది లో ఉందని ప్రభుత్వ పాఠశాలపై అలాంటి అపోహలు తొలగించేందుకు కృషి చేయాలని నగర మేయర్ మహమ్మద్ వసీం సూచించారు. నగరంలోని పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో మేయర్ మహమ్మద్ వసీం శనివారం ఆకస్మికంగా పర్యటించారు.ఈ సందర్భంగా నాడు నేడు పథకం కింద పాఠశాలలో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాల ఆవరణలో వృధాగా పడవేసిన బెంచీలను వినుయోగంలోకి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు.10 వ తరగతి చదువుతున్న విద్యార్థులతో ఉపాద్యాయులు పాఠాలు బాగా చెపుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఉపాద్యాయులతో సమావేశం నిర్వహించి నాడు నేడు కార్యక్రమం తర్వాత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందా అని అరా తీశారు.కోవిడ్ సెకండ్ వేవ్ పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ లు తప్పనిసరిగా ఉపాద్యాయులు దరించడంతో పాటు ప్రతి విద్యార్థి దరించేలా చూడాలని సూచించారు.పాఠశాలలో ఏవైనా మౌలిక సదుపాయాలు అవసరం అయితే తమ దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.మేయర్ వెంట కార్పొరేటర్లు చంద్రమోహన్ రెడ్డి, రహంతుల్లా, ముని శేఖర్, స్థానిక నాయకులు మధుసూదన్, మున్సిపల్ కార్యదర్శి సంగం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Comments (0)
Add Comment