విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగవకాశాలు

విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగవకాశాలు
11న గాంధీ మెడికల్ కాలేజీలో వర్క్ షాప్

విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగావకాశాలపై ఈ నెల 11న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో వర్క్ షాప్ నిర్వహించనున్నారు.

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు.

రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కానున్నారు.

వర్క్ షాప్ లో విదేశాల్లో ఆరోగ్య రంగంలో ఉత్తీర్ణులైన నర్సులకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు.

అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, యుకె, జర్మనీ, ఇతర యూరోపియన్ దేశాల్లో నర్సులకు పెద్ద ఎత్తున ఉన్న డిమాండ్ నేపథ్యంలో నిరుద్యోగులైన నర్సులకు ఆ సమాచారాన్ని కచ్చితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఆయా దేశాల వారీగా ఉన్న అవకాశాలు, భారీగా జీతాలు, నైపుణ్యం కలిగిన వారికి ఉండే అవకాశాలు, అర్హతలు, అర్హతల పరీక్షలు, నియామక ప్రక్రియలు తదితర విషయాలపై నర్సులకు ఉండే సందేహాలను తీర్చనున్నారు.

విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి కలిగిన నర్సులకు తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని వర్క్ షాప్ లో కల్పించనున్నారు.

వర్క్ షాప్ లో ప్రభుత్వ, ప్రయివేటు నర్సింగ్, పారామెడికల్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, నర్సింగ్ అసోసియేషన్ ల నాయకులు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ , ఐఎల్ఓ, నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ (ఎన్ఎస్ డీసీఐ), సీఐఐ స్కిల్లింగ్ డివిజన్ ప్రతినిధులు, ఎన్ సీఎల్ఇఎక్స్-ఆర్ఎన్, ఐఎల్ టీఎస్,ఒఇటి, ఇతర అర్హత పరీక్షలకు శిక్షణ పొందిన నర్సులు పాల్గొననున్నారు.

Nursing Job Opportunities Abroad
Comments (0)
Add Comment