November 27 is Olga’s birthday నవంబర్ 27 ఓల్గా పుట్టిన రోజు

November 27 is Olga’s birthday

నవంబర్ 27 ఓల్గా పుట్టిన రోజు

“నాకు వ్రాయాలని వుంది
ఈ ప్రపంచం పద్మంలా వికసిస్తున్నదని
శాంతి కపోతంలా ఎగురుతున్నదని
ధర్మజ్యోతిలా వెలుగుతున్నదని
కానీ, ఈరోజు అలా వ్రాసేందుకు నోచుకోలేదు
అలా రాసే రోజు వస్తుంది
ఎంత సుదూరంలో అయినా సరే
ఆ వేకువ ఉదయిస్తుంది.”!!

“నీ కంటి ముందు కనిపించే సత్యాన్ని చూడు
నీలోని కుత్సితాన్ని దూరంగా పారద్రోలు
మనిషీ ! నీ అసత్యపు ముసుగు
ఎప్పుడు తీస్తావో చెప్పవోయ్ !!” ( ఓల్గా)

తొలి అడుగు కవిత్వమే..

అయిదుగు రు పైగంబర కవులలో ఓల్గా ఒకరు. నవంబర్ 27, 1950 లో గుంటూరు జిల్లాలో పుట్టారు. ఓల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి. గుంటూరు ఏసి కళాశాలలో చదువుకున్నారు. కవయిత్రిగా మొదలైన సాహిత్య ప్రస్తానం వచన రచనకుమళ్ళింది. నవల,కథ,అనువాదాలు,సంపాదకత్వాలు,సాహిత్య విమర్శనాటిక,నృత్య రూపకం,వ్యాసాలు ఇలా ఓల్గా వచన రచన బహుముఖీనంగా విస్తరించింది. అయితే ఓల్గా సుదీర్ఘ సాహిత్య ప్రయాణానికి తొలి అడుగు మాత్రం కవిత్వమే.

ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి

స్త్రీవాదిగా మారింది కూడా కవిత్వంతోనే. (ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి ,కవిత ) పైగంబర కవిత్వం రెండు సంపుటాల్లో కలిపి ఓల్గా మొత్తం ఎనిమిది కవితలు రాశారు.  పైగంబర కవిత్వం తర్వాత ఎందుకనో ఓల్గా కవిత్వానికి ఎడంగా జరుగుతూ వచ్చారు. ఆతర్వాత అడపాదడపా కవిత్వం రాశారు. కానీ, దానిపై సీరియస్ గా దృష్టిపెట్టలేదనేచెప్పాలి. మొత్తానికి 1972 నుండి అప్పుడప్పుడు రాసిన కవితల్ని ఏర్చి కూర్చి 2011జూలై నెలలో “ ఓల్గా కొన్ని కవితలు “ పేరిట ఓ సంపుటి తెచ్చారు. దీన్ని డా.సి.నారాయణరెడ్డి గారికి అంకితమిచ్చారు.డా.గోపి గారు ముందుమాట రాశారు. పైగంబర కవిత్వంతర్వాత ఓల్గా నుంచి వచ్చిన ఏకైక కవిత్వ సంపుటి ఇది.

స్త్రీల పక్షం వహించిన ఓల్గా

1972 లో ఓల్గా రాసిన “ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి” అన్నకవితలో స్త్రీవాదం ప్రారంభమైంది. ఆ తర్వాత ఓల్గా సాహిత్య ప్రస్తానం వచనంవైపుకుమళ్ళింది. ‌బహుముఖీనంగా విస్తరించింది. “స్త్రీవాద రచయిత్రిగా ఆమె నిలదొక్కుకున్నారు. డా. గోపి గారన్నట్లు “ ఓల్గా బలమైన స్త్రీవాద రచయిత్రి అనీ,ఉద్యమ నేత్రి అనీ” కొత్తగా చెప్పనక్కర లేదు. సుమారు అయిదు దశాబ్దాలుగా ప్రతి క్షణం ఆమె స్త్రీల పక్షం వహించి చైతన్యవంతమైనరచనలు చేసింది.స్త్రీ సాధికారత కోసం పురుషప్రపంచానికి ఎదురునిలిచి పోరాడింది.
”ఆమె ఒక యాక్టివిస్టు మాత్రమే కాదు. గొప్ప సృజన కారిణి కూడా“ అన్న గోపీగారి మాటల్లో ఎంతో నిజముంది. ఇప్పుడొకసారి బహుముఖీనంగా విస్తరించిన ఓల్గా సాహిత్యాన్ని చూడండి.

నవలలు.. సహజ,స్వేఛ్ఛ,మానవి,కన్నీటి కెరటాల వెన్నెల,ఆకాశంలో సగం,గులాబీలు .

కథాసంకలనాలు.. రాజకీయ కథలు,ప్రయోగం,భిన్న సందర్భాలు,మృణ్మయనాదం.

అనువాదాలు.. సామాన్యుల సాహసం,భూమి పుత్రిక,మిస్సింగ్,మూడుతరాలు,పుట్టనిబిడ్డకు తల్లి వుత్తరం, ఉరికొయ్య అంచున, నేనూ సావిత్రిబాయిని, అక్షరయుద్ధాలు.

సంపాదకత్వం.. మాకు గోడలులేవు,నీలిమేఘాలు,నూరేళ్ళ చలం,సారాంశం,సరిహద్దులు లేనిసంధ్యలు,మహిళావర
ణం,జీవితమే ఒక ప్రయోగం,అలజడి మా జీవితం, నవలా మాలతీయం!

ఇతర రచనలు… అతడు..ఆమె..మనం (సాహిత్య విమర్శ ) కుటుంబ వ్యవస్థ, మార్క్సి (వ్యాసం ) వాళ్ళు ఆరుగురు (నాటిక ), యుద్ధము..శాంతి (నృత్య రూపకం) పలికించకు మౌన మృదంగాలను ,(సాహిత్య వ్యాసాలు ),తొలి వెలుగులు (స్త్రీవాద వ్యాసాలు ), కుటుంబ వ్యవస్థ,..! మార్క్సిజం,…ఫెమినిజం‌ (స్త్రీ వాద( వ్యాసాలు ), సహిత (సాహిత్య వ్యాసాలు )

అవార్డులు..

రివార్డులు.. రచయిత్రిగా ఓల్గాకు ఎన్నో అవార్డులొచ్చాయి.అందులో “లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం (నగదు పురస్కారం )
విముక్త. కథాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ముఖ్యమైనవి.ఇంకా ఇతర అవార్డులు చాలానేవున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా పాఠకులనుంచి వచ్చిన రివార్డులు,అన్నీ యిన్నీ కావు!

ఓల్గాకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఎ.రజాహుస్సేన్, రచయిత

November 27 is Olga's birthday zindhagi.com / zindagi.news / yatakarla mallesh / abdul Rajahussen
Comments (0)
Add Comment